92% Marks-Suicide : టెన్త్ లో 92 శాతం మార్కులు.. స్టూడెంట్ సూసైడ్
92% Marks-Suicide : ఫెయిల్ అయితే .. ఓడిపోయినట్టు కాదు..ఫెయిల్యూరే .. సక్సెస్ కు తొలిమెట్టు..ఈవిషయాన్ని విద్యార్థులకు అర్ధమయ్యేలా చెప్పడంలో విద్యా సంస్థలు, తల్లిదండ్రులు సక్సెస్ కాలేకపోతున్నారేమో అనిపిస్తోంది..
- Author : Pasha
Date : 09-06-2023 - 10:57 IST
Published By : Hashtagu Telugu Desk
92% Marks-Suicide : ఫెయిల్ అయితే .. ఓడిపోయినట్టు కాదు..
ఫెయిల్యూరే .. సక్సెస్ కు తొలిమెట్టు..
ఈవిషయాన్ని విద్యార్థులకు అర్ధమయ్యేలా చెప్పడంలో విద్యా సంస్థలు, తల్లిదండ్రులు సక్సెస్ కాలేకపోతున్నారేమో అనిపిస్తోంది..
ఒక విద్యార్థికి టెన్త్ ఎగ్జామ్ లో 92 శాతం మార్కులు(92% Marks-Suicide) వచ్చాయి. అయినా అతడు దాన్ని పాజిటివ్ గా తీసుకోలేకపోయాడు. ఇంకా ఎక్కువ మార్కులు సాధించలేకపోయానని అనవసరమైన బాధకు లోనయ్యాడు. ఓ ఎత్తైన భవనపు 23వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే నగరంలో ఉన్న వర్తక్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ 15 ఏళ్ళ బాలుడి ఆత్మహత్యకు అసలు కారణమేంటో ఇంకా తెలియలేదు. అతడు 10వతరగతి పరీక్షలలో 92 శాతం మార్కులు సాధించాడని, దాని ఫలితాలు గతవారమే వచ్చాయని మాత్రం పోలీసులకు తెలిసింది. దీంతో ఆ కోణంలో ఇప్పుడు పోలీసు దర్యాప్తు జరుగుతోంది. ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
Also read : Suicide for Lost Phone: ఫోన్ పోయిందని యువకుడి ఆత్మహత్య!
ఇటీవల హైదరాబాద్ లో..
ఇక ఇటీవల హైదరాబాద్ కుల్సుంపురలోని భరత్ నగర్ బస్తీలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. అయితే క్షుద్రపూజల వల్లే తమ కూతురు ఆత్మ హత్య చేసుకున్నట్లు నవ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని రోజులుగా తమ ఇంటి ముందు పూజలు చేసి.. నిమ్మకాయలు,దీపాలు పెట్టి వెళుతున్నారని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.