10th Results: మధ్యాహ్నం 12గంటలకు ఏపీ టెన్త్ రిజల్ట్స్.. విడుదల చేయనున్న మంత్రి బొత్స..!
ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు సోమవారం రిలీజ్ కానున్నాయి.10th
- Author : hashtagu
Date : 05-06-2022 - 4:24 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు సోమవారం రిలీజ్ కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏపీలో పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి మే 9వరకు జరిగాయి. ఈ ఎగ్జామ్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్షాల కేంద్రాల్లో 6,21799మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కాగా ఫలితాలు జూన్ 4వ తేదీని విడుదల కావాల్సి ఉండగా…వాయిదా పడిన సంగతి తెలిసిందే.
విజయవాడలో పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ టెన్త్ రిజల్ట్స్ ఉదయం 11గంలకు రిలీజ్ చేస్తామని ప్రకటించింది. కానీ ఉదయం 11 దాటినా ఫలితాలు రిలీజ్ కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళణ చెందారు. కాసేపటికి సాంకేతిక కారణాల వల్ల ఫలితాలు వెల్లడి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తేదీని మరోసారి ప్రకటిస్తామని చెప్పారు. కాగా సోమవారం ఫలితాలు మధ్యాహ్నం 12గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ రిలీజ్ చేయనున్నారు.