World Food Day 2024: 73 కోట్ల మంది ఆకలి కేకలు.. వెంటాడుతున్న పోషకాహార లోపం
రైతులు ప్రపంచ జనాభా అవసరాలకు మించిన రేంజులో ఆహారాన్ని ఉత్పత్తి(World Food Day 2024) చేస్తున్నారు.
- By Pasha Published Date - 11:11 AM, Wed - 16 October 24

World Food Day 2024: ఇవాళ (అక్టోబర్ 16) ప్రపంచ ఆహార దినోత్సవం. 1945లో ఇదే తేదీన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. అప్పటి నుంచే ఏటా అక్టోబరు 16న దాదాపు 150కిపైగా దేశాల్లో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.ఆకలి, పోషకాహార లోపం, ఆహార భద్రతలపై ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం లక్ష్యం. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆహార దినోత్సవం థీమ్ మారుతుంటుంది. ‘‘మంచి జీవితం, మంచి భవిష్యత్తు కోసం.. ఆహారం అందించడమే లక్ష్యం’’ అనేది ఈ ఏడాది థీమ్.
Also Read :Anaesthesia Day 2024 : ‘అనెస్తీషియా’.. రోగుల బాధలు దూరం చేసిన విప్లవాత్మక విధానం
ఆహార దినోత్సవం వేళ ఇవి తెలుసుకుందాం..
- రైతులు ప్రపంచ జనాభా అవసరాలకు మించిన రేంజులో ఆహారాన్ని ఉత్పత్తి(World Food Day 2024) చేస్తున్నారు. అయినా చాలా దేశాల్లో ఆహార కొరత ఉంది. కొన్ని ఆఫ్రికా దేశాల్లోనైతే ఆకలి చావులు కంటిన్యూ అవుతున్నాయి.
- వాతావరణ మార్పులు, సంఘర్షణలు, ఆర్థిక మాంద్యం, అసమానత, తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల మంది ఆకలితో బాధపడుతున్నారు.
- ప్రపంచవ్యాప్తంగా దాదాపు 280 కోట్ల మందికిపైగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని తాజా సర్వేల్లో వెల్లడి కావడం ఆందోళన కలిగించే అంశం.
- భారత్ సహా చాలా ప్రపంచ దేశాల ప్రజల్లో తీవ్ర పోషకాహార లోపం ఉంది. దీనివల్ల ప్రజలు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పేదరికం, సరైన ఆదాయం లేకపోవడమే ఇందుకు మూలకారణం.
- ప్రపంచ దేశాల ఆహార అవసరాలను తీర్చడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. సుగంధ ద్రవ్యాలు, పాలు, పప్పుల ఉత్పత్తిలో భారత్ వరల్డ్ నంబర్ 1. టీ, చెరకు, గోధుమలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో భారత్ వరల్డ్ నంబర్ 2.
Also Read :Jharkhand Elections : జార్ఖండ్‌లో ఎన్డీయే వర్సెస్ ఇండియా.. బలాలు, బలహీనతలు ఇవే
- ఆరోగ్యం బాగా ఉండాలంటే.. మంచి ఆహారం తినాలి. తాజా ఆహారపదార్ధాలను తింటే ఆరోగ్యానికి మంచిది.
- వంట గదిని, వంట చేసే పాత్రలను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
- ప్రత్యేకించి మాంసాహారాలను వండేటప్పుడు శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగితే.. అందులోని బాక్టీరియా దూరం అవుతుంది.
- సరైన టెంపరేచర్ వద్ద ఆహారాన్ని వండాలి. తద్వారా అది త్వరగా జీర్ణం అవుతుంది. ఫాస్ట్ ఫుడ్ లను తినడం తగ్గించాలి.