DJ Sound : DJ సౌండ్ తో ప్రాణాలు పోతాయా?
DJ Sound : డీజే శబ్దాలు కేవలం పెద్దలకే కాకుండా, గర్భిణీ స్త్రీలకు కూడా అత్యంత ప్రమాదకరమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా గర్భం దాల్చిన నాలుగో నెల నుండి, డీజే శబ్దాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు
- By Sudheer Published Date - 10:50 AM, Fri - 5 September 25

ఈ మధ్య డీజే సౌండ్స్ (DJ Sounds) వద్ద డాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెద్ద శబ్దాలు మనిషి శరీరంపై ఎంత తీవ్ర ప్రభావం చూపుతాయో ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి. డీజే సౌండ్స్ కేవలం చెవులకు మాత్రమే కాకుండా, గుండె, మెదడు వంటి కీలక అవయవాలకు కూడా హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Harish Rao : రేపు KCRతో హరీశ్ భేటీ..ఏంచెప్పబోతున్నాడో..!!
జర్మనీలోని ఒక విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో డీజేల నుండి వచ్చే భారీ శబ్దాలు గుండె కొట్టుకునే వేగాన్ని గణనీయంగా పెంచుతాయని తేలింది. దీనివల్ల రక్తపోటు (బీపీ) పెరిగి మెదడులోని సున్నితమైన నరాలు చిట్లిపోవచ్చు, ఫలితంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలం పాటు ఇలాంటి శబ్దాలకు గురికావడం వల్ల గుండె జబ్బులు, వినికిడి లోపం వంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.
డీజే శబ్దాలు కేవలం పెద్దలకే కాకుండా, గర్భిణీ స్త్రీలకు కూడా అత్యంత ప్రమాదకరమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా గర్భం దాల్చిన నాలుగో నెల నుండి, డీజే శబ్దాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. భారీ శబ్దాలు గర్భస్రావానికి కూడా కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు. వినోదం కోసం ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదని, పెద్ద శబ్దాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.