5 Expensive Alcohol: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 5 వైన్స్ ఇవే…!! ఒక్కో వైన్ 50కోట్ల పైమాటే…!!
- By hashtagu Published Date - 12:45 PM, Sat - 12 November 22

చాలా మంది తినడం మానేస్తారు కానీ…మద్యం తాగడం మాత్రం మానరు. సామాన్యులు మత్తు కోసం తాగితే…సంపన్నులు మాత్రం స్టేటస్ కోసం తాగుతుంటారు. మద్యం తయారీదారులు కూడా సంపన్నుల అవసరాలకు తగ్గట్లుగా ఖరీదైన మద్యం తయారు చేస్తారు. సీసాలో ఉండే మద్యం ఖరీదు అనుకుంటే పొరాపాటే. ఎందుకంటే మద్యం కంటే సీసాలు చాలా ఖరీదైనవి కూడా ఉన్నాయి. బంగారం, వజ్రాలు, ప్లాటీనంతో తయారుచేసిన సీసల్లోని మద్యం తాగాలని సంపన్నులు పోటీ పడుతుంటారు. అలాంటి వైన్ ప్రపంచంలోనే 5 ఉన్నాయి. వీటిని ప్రపంచ నలుమూలల నుంచి బిలియనీర్లు వాటిని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతుంటారు. ఎందుకంటే వాటి వాసన, రుచి, తయారీ విధానం వాటిని ప్రపంచంలోనే టాప్ 5 స్థానంలో ఉంచాయి. అవేంటో చూద్దం.
మకాల్లన్ :
1926 మకాల్లన్ ఫైన్ అండ్ రేర్ కలెక్షన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీలలో ఇది ఒకటి. ఇందులో 40 బాటిళ్లను మాత్రమే రెడీ చేశారు. `1987లో న్యూయార్క్ లో 5వేల పౌండ్లకు దీన్ని వేలం వేశారు. ఈ విస్కీ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కళాఖండాలను వేలం వేసే సూడ్ బీస్ వెబ్ సైట్లోకి ఎక్కింది. 2019లో జరిగిన వేలం పాటలో ఇది 1452000 పౌండర్లకు అంటే భారత క రెన్సీలో దాదాపు 13కోట్ల 78లక్షల రూపాయలకు విక్రయించారు.
హెన్రీ:
ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అత్యంత ఖరీదైన వైన్ లలో ఒకటి. కాగ్నాక్ ఒకరకమైన బ్రాందీ. దీని బాటిల్ 24 క్యారెట్ బంగారం, ప్లాటినంతో తయారు చేశారు. 6500కట్ డైమండ్స్ పొదిగించారు. ఇది వంద సంవత్సరాలకు పైగా బారెల్ లో ఉంచి తయారు చేశారు. వెయ్యి మిల్లీలీటర్ల బాటిల్ ధర 2 మిలియన్లు అంటే భారత కరెన్సీ ప్రకారం 16కోట్లకు పైగానే ఉంటుంది.
Tequila Ley 295 Diamante :
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టేకిలా బాటిల్. టేకిలా అనేది బ్లూ కిత్తలి నుంచి తయారైన మెక్సిన్ మద్యం. దీని బాటిల్ తయారీకి 2 కిలోల ప్లాటినం, 4వేలకు పైగా తెల్లవజ్రాలు ఉపయోగించారు. దీని విలువ సుమారు 28కోట్లకు పైగా మాటే.
బిలియనీర్ వోడ్కా :
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వొడ్కా. కేవలం డిమాండ్ తగ్గట్లుగానే దీన్ని రెడీ చేస్తారు. దీన్ని రెడీ చేసేందుకు రహస్య రష్యన్ రెసిపీని ఉపయోగిస్తారు. తక్కువ పరిమాణంలో తయారు చేస్తారు. దీని తయారు కోసం ట్రిపుల్ డిస్టిల్డ్ వాటర్ ఉపయోగిస్తారు. ఈ బాటిల్ పై వజ్రాల పూత ఉంటుంది. దీని ధర దాదాపు 30కోట్లు.
ఇసాబెల్లా ఇస్లే:
ఈ వైన్ బాటిల్ తయారు చేయడానికి బంగారం, వజ్రాలు ఉపయోగించారు. ఇవే కాకుండా 300నీలమణిని కూడా పొదిగించారు. దీని విలువ 50కోట్లకు పైగామాటే.