Highest Railway Bridge in the World: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన పై నుంచి ట్రైన్ రన్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఉంది. తొలిసారిగా దీనిపై నుంచి త్వరలో ట్రైన్ పరుగులు తీయనుంది.
- By Maheswara Rao Nadella Published Date - 11:34 AM, Sat - 1 April 23
Highest Railway Bridge in the World : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (Highest Railway Bridge) కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఉంది. తొలిసారిగా దీనిపై నుంచి త్వరలో ట్రైన్ పరుగులు తీయనుంది. రాంచీ – జమ్ము తావి మధ్య నడిచే 18309 నంబర్ SBP JAT ఎక్స్ ప్రెస్ ను నేరుగా శ్రీనగర్ వరకు నడపాలని రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. ఈ రైలు వారానికి 4 రోజులు( (సోమ, మంగళ, గురు, శనివారాల్లో) నడుస్తుంది.ఇప్పటికే ఈ వంతెన పై ట్రయల్ రన్ పూర్తి చేశారు. మహేంద్ర బొలెరో కారును రైలు తనిఖీ వాహనంగా మార్చారు. చీనాబ్ వంతెనపై కారు నడుస్తున్న చిత్రాలు వైరల్ అయ్యాయి. ఈ వంతెన జనవరి 2024 నాటికి లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది.
వంతెన విశేషాలు
- వంతెనను ఉక్కుతో నిర్మించారు.
- మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను ఈ వంతెన తట్టుకోగలదు.
- చీనాబ్ వంతెన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంది.
- ఇది చీనాబ్ నదికి 359 మీటర్లు (1,178 అడుగులు) ఎత్తులో ఉంది.
- ఇది వంపు వంతెన.
- చీనాబ్ బ్రిడ్జి పొడవు 1315 మీటర్లు, దీని నిర్మాణానికి రూ.1400 కోట్లు ఖర్చయ్యాయి.
- ఇది 260 కి.మీ పొడవు ఉంది.
- ఇది బలమైన గాలులను తట్టుకోగలదు.
- ఇది మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు.
- ఈ ఆర్క్ బ్రిడ్జ్ రియాక్టర్ స్కేల్‌పై 8 తీవ్రతతో వచ్చిన భూకంపం మరియు 30 కిలోల పేలుడు పదార్థాల పేలుడును తట్టుకోగలదు.
- చీనాబ్ రైల్వే వంతెన “260 kmph వేగంతో వీచే గాలులను తట్టుకోగలదు.
- ఈ వంతెన జీవిత కాలం 120 సంవత్సరాలు.
- 2003 లో ఈ వంతెన పనులు మొదలై 2003లో పూర్తయ్యాయి.
రైల్వేశాఖ ప్రకటన
చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అన్ని పరీక్షలు నిర్వహించామని, అవన్నీ విజయవంతం అయినట్లు కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ వంతెన అధిక గాలులు, ఉష్ణోగ్రత, భూకంపాలను తట్టుకుంటుందా..? అనే పరీక్షలు నిర్వహించారు. వంతెన ప్రారంభానికి సిద్ధంగా ఉందని, వంతెనపై రైల్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read: YouTube Village: ఈ గ్రామ విశిష్టత ఏంటో తెలుసా? మరియు అది ఎక్కడ ఉంది?
Related News
Telegram Down In India: భారత్‌లో టెలిగ్రామ్ డౌన్.. అయోమయానికి గురైన యూజర్స్..!
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్ కొంచెం సమయం పని చేయడం ఆగిపోయింది.