Sinking Town : పాతాళంలోకి వెళ్లిపోతున్న పట్నం.. ఎందుకు ?
Sinking Town : ఆ పట్టణం నవంబరు 10 నుంచి ప్రతిరోజూ 1 సెంటీమీటర్ చొప్పున కుంగుతోంది..
- By pasha Published Date - 01:56 PM, Sat - 18 November 23

Sinking Town : ఆ పట్టణం నవంబరు 10 నుంచి ప్రతిరోజూ 1 సెంటీమీటర్ చొప్పున కుంగుతోంది..
అది కుంగే ప్రక్రియ ఇప్పుడు స్పీడప్ అయింది..
గత రెండు రోజులుగా ఆ పట్టణం డైలీ 4 సెంటీమీటర్లు చొప్పున కుంగుతోంది..
ఇంతకీ ఎక్కడుంది ఆ పట్టణం ? ఎందుకు కుంగిపోతోంది ?
We’re now on WhatsApp. Click to Join.
అది ఐస్‌లాండ్ దేశం. ప్రతి సంవత్సరం ఇక్కడ వందలాదిగా భూకంపాలు వస్తుంటాయి. ప్రపంచంలో అగ్ని పర్వతాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ దేశంలోని పశ్చిమ ప్రాంతంలోని ఉన్న ఒక పట్టణం పేరు గ్రిండావిక్. ఆ టౌన్‌లో ఈనెల 10 నుంచి రోజుకొక సెంటీమీటర్ చొప్పున నేల కుంగుతోంది. ఇప్పుడా కుంగుబాటు ఏకంగా రోజూ 4 సెంటీమీటర్లకు పెరిగింది. ఐస్‌లాండ్‌లో రానున్న రోజుల్లో బద్దలయ్యే అవకాశాలున్న కొన్ని యాక్టివ్ అగ్నిపర్వతాలు గ్రిండావిక్ టౌన్‌కు దగ్గర్లోనే ఉన్నాయి. బహుశా ఆ అగ్ని పర్వతాల కింద పాతాళంలో చోటుచేసుకుంటున్న భౌగోళిక మార్పుల వల్లే ఈవిధంగా గ్రిండావిక్ టౌన్‌లో నేల కుంగుబాటుకు గురవుతుండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: NBK Unstoppable: రష్మిక అందాలకు పిచ్చెక్కిపోయిన బాలయ్య, అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమో అదుర్స్
దీనికి సిగ్నల్ ఏమిటంటే.. గ్రిండావిక్ పట్టణంలోని భూగర్భంలో 15 కిలోమీటర్ల లోతున అగ్నిపర్వత శిలాద్రవం తీవ్రంగా ప్రవహిస్తోందని కొన్ని రోజుల క్రితం గుర్తించారు. ఆ శిలాద్రవం వ్యాపించినంత ఏరియాలోని భూమి కింద ఉన్న రాళ్లు కూడా కరిగిపోతున్నాయని నిపుణులు చెప్పారు. ఈ పరిణామం వల్లే గ్రిండావిక్ పట్టణం పరిధిలోని నేల కుంగుతూపోతోందని విశ్లేషిస్తున్నారు. అండర్‌గ్రౌండ్‌లో వెళుతున్న కార్గో రైలులా.. ఈ ఏరియాలోని పాతాళంలో అగ్నిపర్వత లావా ప్రవహిస్తోందని వివరించారు. దీనిపై ప్రజలను హెచ్చరించడంతో ఇప్పటికే ఈ టౌన్(Sinking Town) నుంచి ఇళ్లు ఖాళీ చేసి తాత్కాలికంగా వేరే చోట్లకు వెళ్లిపోయారు. భవనాలు, రోడ్లకు తిరిగి నిర్మించలేనంతగా ఈ టౌన్ త్వరలో కుంగిపోతుందని అంచనా వేస్తున్నారు.
Related News

800 Earthquakes : వణికిపోయిన ఐస్‌లాండ్.. 14 గంటల్లో 800 భూప్రకంపనలు
800 Earthquakes : ఈ మధ్య ఎందుకో ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు పెరిగిపోయాయి.