NBK Unstoppable: రష్మిక అందాలకు పిచ్చెక్కిపోయిన బాలయ్య, అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమో అదుర్స్
నేషనల్ క్రష్ రష్మిక, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కలిసిన నటించిన యానిమల్ మూవీ డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ కానుంది.
- Author : Balu J
Date : 18-11-2023 - 1:45 IST
Published By : Hashtagu Telugu Desk
NBK Unstoppable: నేషనల్ క్రష్ రష్మిక, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కలిసిన నటించిన యానిమల్ మూవీ డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ కానుంది. దీంతో ఈ టీమ్ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఇటీవల, వారు అన్‌స్టాపబుల్ షో లో బాలయ్యతో కలిసి సందడి చేశారు. రణ్‌బీర్, రష్మిక మందన్న, చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు. ఈరోజు, ఆహా ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోను వదిలింది. బాలకృష్ణ మరియు సందీప్ రెడ్డి వంగాల మధ్య సరదా సంభాషణతో ప్రోమో ప్రారంభమవుతుంది.
బాలకృష్ణ సందీప్‌ని తన ఆల్కహాల్ బ్రాండ్‌ను తాగాలని చెప్పడం ప్రేక్షకులకు నవ్వులు తెప్పించింది. ఇక బాలకృష్ణ బహుముఖ నటుడైన రణబీర్ కపూర్‌కు ఘనమైన ఎలివేషన్ ఇస్తాడు. లెజెండ్‌లోని బాలయ్య డైలాగ్‌ను రణబీర్ నోటితో చెప్పడం ద్వారా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. రష్మిక మందన్న అందాలను చూసి పిచ్చెక్కిపోతున్నానని బాలకృష్ణ అన్నారు.
రష్మిక తన రాబోయే చిత్రాల వివరాలను వెల్లడించింది. యానిమల్ షూటింగ్ అంతా పుష్ప 2 కథను ఊహించుకుంటూనే ఉన్నామని రణబీర్ చెప్పాడు. ఇక విజయ్ దేవరకొండ బాలయ్య మరియు యానిమల్ టీమ్‌తో మొబైల్‌లో మాట్లాడాడు. ఈ ప్రోమో ప్రేక్షకులకు కింగ్-సైజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, అయితే దానిని చూడాలంటే నవంబర్ 24 వరకు ఆగక తప్పదు.
Also Read: Sreeleela: బ్లాక్ శారీలో సెగలు రేపుతున్న శ్రీలీల, లేటెస్ట్ పిక్స్ వైరల్