Hyderabad: సాహసం చేయరా డింభకా!
వాళిద్దరు అన్నదమ్ములు ఒకరు సాయితేజ, మరొకరు రవితేజ.. ‘మీ ఇద్దరూ పెద్దయ్యాక ఏం అవుతారు’ అడిగితే వెంటనే వాళ్లు చెప్పిన సమాధానం ‘ట్రావెలర్స్’. కానీ చాలా మంది పిల్లలు.. పెద్దయ్యాక తమ అభిరుచులు,
- By Balu J Published Date - 12:54 PM, Fri - 25 February 22

వాళిద్దరు అన్నదమ్ములు ఒకరు సాయితేజ, మరొకరు రవితేజ.. ‘మీ ఇద్దరూ పెద్దయ్యాక ఏం అవుతారు’ అడిగితే వెంటనే వాళ్లు చెప్పిన సమాధానం ‘ట్రావెలర్స్’. కానీ చాలా మంది పిల్లలు.. పెద్దయ్యాక తమ అభిరుచులు, అలవాట్లు మారుతుంటాయి. కానీ ఈ సోదరులు చిన్నప్పుడు ఏదైతే కలగన్నారో.. పెదయ్యాక కూడా తమ డ్రీమ్స్ కోసం పనిచేశారు. రవి (27), సాయి (24) ఇప్పుడు హైదరాబాద్‌లో విజయవంతమైన అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ, క్లిఫ్-ఇన్ అడ్వెంచర్‌ను విజయవంతంగా నడుపుతున్నారు.
గాంగ్‌టక్‌లోని ఇండియన్ హిమాలయన్ సెంటర్ ఫర్ అడ్వెంచర్ అండ్ ఎకో టూరిజం (IHCAE) నుండి శిక్షణ పొందిన పర్వతారోహకుడు సాయి మాట్లాడుతూ.. నాకు గుర్తున్నంత వరకు ప్రతినిత్యం కొండలు, గుట్టలు, పర్వతాలు అధిరోహించాలని కోరుకుంటా. పర్వతారోహణపై మక్కువ ఉన్న నేను అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ వ్యవస్థాపకుడు కె రంగారావు ఆధ్వర్యంలో పనిచేశాను. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. కానీ నేను నా స్వంతంగా ఏదైనా చేయాలనుకున్నాను. కాబట్టి నేను 2019 లో నా సోదరుడితో కలిసి ఈ అడ్వెంచర్ క్లబ్ ను ప్రారంభించాను” అని అంటున్నాడు.
అప్పటి నుండి ఇద్దరూ దాదాపు 100 ట్రెక్‌లను విజయవంతంగా చేపట్టారు. సమీపంలోని కొండలకే కాదు, హిమాలయాలలో కూడా. “ప్రకృతిలో గడపడానికి ఎక్కువ సమయం లేని కుటుంబాలు, కార్పొరేట్ ఉద్యోగుల కోసం మేం ట్రెక్స్ ప్లాన్ చేస్తాం. అంతేకాదు.. అటవీ ప్రాంతాలకు సమీపంలో క్యాంప్‌సైట్‌లను ఏర్పాటు చేస్తాం, అక్కడ వారు తమ కార్యాలయాలకు తిరిగి వచ్చే ముందు రాత్రి విశ్రాంతి తీసుకోవచ్చు” సాయి చెప్పారు. ఇటీవలే ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు పొందిన ఎనిమిదేళ్ల నగరానికి చెందిన తేలుకుంట విరాట్ చంద్రకు సాయి తేజ శిక్షణ ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో ట్రెక్కింగ్, పర్వతారోహణ ట్రైనింగ్ తీసుకునేవాళ్లకు శిక్షణ ఇస్తున్నారు ఈ సోదరులు.