Su-57 : రష్యా నుంచి భారత్‌కు పవర్‌ఫుల్ ఫైటర్ జెట్.. విశేషాలివీ..
Su-57 : ప్రపంచంలోని టాప్-10 అత్యంత ప్రమాదకర యుద్ధ విమానాలలో రెండోది ‘ఎస్‌యూ-57’ (Su-57).
- By pasha Published Date - 02:26 PM, Sat - 18 November 23

Su-57 : ప్రపంచంలోని టాప్-10 అత్యంత ప్రమాదకర యుద్ధ విమానాలలో రెండోది ‘ఎస్‌యూ-57’ (Su-57). ఇది కూడా ఫ్యూచర్‌లో భారత సైన్యం అమ్ములపొదిలో చేరే దిశగా అడుగులు పడుతున్నాయి. భారత్‌తో కలిసి దీన్ని భారత్‌లోనే తయారు చేసే అంశంపై ప్రస్తుతం రష్యా చర్చలు జరుపుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి కూడా ఈమేరకు ప్రపోజల్ పంపినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఏయే దేశాలు ఏ విధంగా స్పందించాయి ? ఏ విధమైన షరతులు పెట్టాయి ? అనేది తెలియాల్సి ఉంది. వాస్తవానికి భారత్ ‘ఎస్‌యూ-57’ ప్రాజెక్టుపై అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఎందుకంటే ఇప్పటికే భారత్ ఇలాంటి పలు ప్రాజెక్టులలో ఎంగేజ్ అయి ఉంది.
Also Read: Sinking Town : పాతాళంలోకి వెళ్లిపోతున్న పట్నం.. ఎందుకు ?
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. సుఖోయ్ ‘ఎస్‌యూ-57’ యుద్ధ విమానం పనితీరుపై భారత్ కొంత అనుమానపు భావనతో ఉందని పరిశీలకులు అంటున్నారు. ఈ ఐదోతరం సుఖోయ్ యుద్ధ విమానం భారత్ సైనిక అవసరాలకు తీర్చగలదా ? నిర్వహణ భారం ఎంత ఉంటుంది ? ‘ఎస్‌యూ-57’ లోని ఇంజన్ టెక్నాలజీ, రాడార్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సామర్థ్యం ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న యుద్ధ విమానాలతో ఇమడగలవా ? అనే ప్రశ్నలకు సమాధానాలను వెతికే పనిలో భారత రక్షణశాఖ వర్గాలు ఉన్నాయట. స్వదేశీ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) తయారీలో బిజీగా ఉన్న భారత్ ప్రస్తుతానికి మరే కొత్త ప్రాజెక్టుపై ఫోకస్ చేయాలని అనుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. 2030 నాటికి AMCA యుద్ధ విమానం భారత వైమానిక దళానికి అందుబాటులోకి వస్తుంది. ఇది భారతదేశ వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పనిచేయగలదు.
We’re now on WhatsApp. Click to Join.
సుఖోయ్ ‘ఎస్‌యూ-57’ ప్రత్యేకతలు..
- ‘ఎస్‌యూ-57’ రష్యా యొక్క మొదటి స్టెల్త్ విమానం. ఒక పైలట్ దాన్ని నడపొచ్చు.
- ఈ ఫైటర్ జెట్ పొడవు 65.11 అడుగులు, రెక్కలు విస్తీర్ణం 46.3 అడుగులు, ఎత్తు 15.1 అడుగులు.
- ‘ఎస్‌యూ-57’ గరిష్ట వేగం గంటకు 2135 కిమీ. సూపర్ సోనిక్ వేగం పరిధి గంటకు 1500 కి.మీ.
- ఇది 2019లో రష్యన్ వైమానిక దళంలో చేర్చబడింది.
- రష్యా ఇప్పటివరకు 32 ‘ఎస్‌యూ-57’ యుద్ధ విమానాలను తయారు చేసింది.
- Su-57 ఫైటర్ జెట్‌లో రెండు సాటర్న్ L-41F1 ఆఫ్టర్ బర్నింగ్ టర్బోఫ్యాన్ ఇంజన్‌లు ఉన్నాయి. ఇది గరిష్టంగా 66 వేల అడుగుల ఎత్తుకు ఎగరగలదు.
- ఈ యుద్ధ విమానంలోని రెండు ఔట్‌బోర్డ్ ఇంధన ట్యాంకులను నింపితే 4500 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు.
- ఈ ఫైటర్ జెట్‌లోని 30 ఎంఎం ఆటోకానన్ తుపాకీ నుంచి ప్రతి నిమిషానికి 1800 బుల్లెట్లను కాల్చవచ్చ. ఈ తుపాకీ రేంజ్ 1800 మీటర్ల వరకు ఉంటుంది.
- రష్యన్ ఫైటర్ జెట్‌లో 12 హార్డ్ పాయింట్లు ఉన్నాయి. వీటిలో రాకెట్లు, బాంబులు, క్షిపణుల వంటి వివిధ రకాల ఆయుధాలను అమర్చవచ్చు.
- ఈ ఫైటర్ జెట్ ద్వారా గాలి నుంచి గగనతలంలోకి, గాలి నుంచి భూమిపైకి క్షిపణులను ప్రయోగించవచ్చు.
- యాంటీ షిప్ క్షిపణులను కూడా దీని నుంచి వేయొచ్చు.
- గైడెడ్, అన్‌గైడెడ్, క్లస్టర్ బాంబులు, యాంటీ ట్యాంక్ బాంబులు, యాక్టివ్ హోమింగ్ బాంబులను ఈ ఫైటర్ జెట్‌లో(Su-57) అమర్చవచ్చు.
Related News

Gujarat Rains : గుజరాత్ లో తగ్గని వర్షాలు.. పిడుగుపాటుకు 27 మంది మృతి
గుజరాత్ లో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.