రైల్వేలో ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ వివరాలీవే!
అభ్యర్థులు తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, కేవలం అధికారిక RRB వెబ్‌సైట్లను మాత్రమే చూడాలని సూచించారు.
- Author : Gopichand
Date : 25-12-2025 - 6:10 IST
Published By : Hashtagu Telugu Desk
RRB Recruitment: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 311 పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించింది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీసు సంఖ్య CEN-08/2025 కింద ఈ నియామకాలు జరగనున్నాయి. ప్రస్తుతం ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే, పూర్తి స్థాయి నోటిఫికేషన్ త్వరలోనే అధికారిక వెబ్‌సైట్లలో విడుదల కానుంది.
ముఖ్యమైన పోస్టులు- ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్‌లో అత్యధికంగా జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ) – 202 పోస్టులు ఉన్నాయి. ఇతర పోస్టుల వివరాలు కింద చూడవచ్చు.
- జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ)- లెవల్-6, జీతం రూ. 35,400 (18-33 ఏళ్లు)- 202 పోస్టులు
- ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-III- లెవల్-2, రూ. 19,900 (18-30 ఏళ్లు)
- స్టాఫ్ & వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్- లెవల్-6, రూ. 35,400 (18-33 ఏళ్లు)
- చీఫ్ లా అసిస్టెంట్- లెవల్-7, రూ. 44,900 (18-40 ఏళ్లు)
- సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, లెవల్-6, రూ. 35,400 (18-33 ఏళ్లు)
- పబ్లిక్ ప్రాసిక్యూటర్- లెవల్-7, రూ. 44,900 (18-32 ఏళ్లు)
- సైంటిఫిక్ అసిస్టెంట్ (ట్రైనింగ్)- లెవల్-6, రూ. 35,400 (18-35 ఏళ్లు)
Also Read: మీ పిల్లలకు రాయడం నేర్పించే పద్ధతులు ఇవే!
అభ్యర్థులకు ముఖ్య సూచనలు
ఆధార్ వెరిఫికేషన్: దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తమ ఆధార్‌ను ధృవీకరించుకోవాలని RRB సూచించింది.
ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ 10వ తరగతి సర్టిఫికేట్‌తో సరిపోలాలి.
ఆధార్‌లో లేటెస్ట్ ఫోటో, బయోమెట్రిక్ (వేలిముద్రలు, కంటిపాప) అప్‌డేట్ అయి ఉండాలి.
వైద్య ప్రమాణాలు: పోస్టును బట్టి B-1, C-1, C-2 వంటి మెడికల్ స్టాండర్డ్స్ నిర్ణయించబడ్డాయి. అభ్యర్థులు వీటిని గమనించాలి.
అధికారిక వెబ్‌సైట్ల జాబితా
అభ్యర్థులు తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, కేవలం అధికారిక RRB వెబ్‌సైట్లను మాత్రమే చూడాలని సూచించారు. మన ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన వెబ్‌సైట్లు ఇవే..
- RRB సికింద్రాబాద్: www.rrbsecunderabad.gov.in
- RRB బెంగళూరు: www.rrbbnc.gov.in
- RRB చెన్నై: www.rrbchennai.gov.in