Ganesh laddu Auction: రిచ్‌మండ్ విల్లాస్ గణేష్ లడ్డూ రూ.1.25 కోట్లకు వేలం
గణేష్ ఉత్సవాలకు ఎంత క్రేజ్ ఉంటుందో, చివరి రోజున జరిగే లడ్డూ వేలంపాట అంతే మాజానిస్తుంది. వేలాది సమక్షంలో వేలంపాట నిర్వహిస్తారు. పదుల సంఖ్యలో వేలంలో పాల్గొని భక్తులు లడ్డూని కైవసం చేసుకోవాలనుకుంటారు.
- By Praveen Aluthuru Published Date - 03:32 PM, Thu - 28 September 23

Ganesh laddu Auction: గణేష్ ఉత్సవాలకు ఎంత క్రేజ్ ఉంటుందో, చివరి రోజున జరిగే లడ్డూ వేలంపాట అంతే మాజానిస్తుంది. వేలాది మంది సమక్షంలో వేలంపాట నిర్వహిస్తారు. పదుల సంఖ్యలో వేలంలో పాల్గొని భక్తులు లడ్డూని కైవసం చేసుకోవాలనుకుంటారు. హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేశుడికి ఎంత ప్రత్యేకత ఉంటుందో బాలాపూర్ లడ్డూ వేలంపాటకి అంతే క్రేజ్ కనిపిస్తుంది. ఈ ఏడాది 27 లక్షలు వెచ్చించి ఓ వ్యాపారి బాలాపూర్ లడ్డూని కొన్నాడు. అయితే హైదరాబాద్ లో ఓ లడ్డూ ఏకంగా కోటిరూపాయలు దాటింది. బండ్లగూడ లడ్డూ వేలంపాటలో రికార్డు ధరకు అమ్ముడైంది. బండ్లగూడ జాగీర్‌లోని సన్‌సిటీలోని రిచ్‌మండ్ విల్లాస్‌లోని గణేష్ లడ్డూ అన్ని రికార్డులను బద్దలు కొడుతూ రూ.1.25 కోట్లకు వేలంపాటలో అమ్ముడైంది
బండ్లగూడ సన్ సిటీలోని రిచ్‌మండ్ విల్లాస్ నివాసితులు గణేష్ చతుర్థి చివరి రోజున తమ ఉత్సవాల్లో భాగంగా గణేష్ లడ్డూ వేలం నిర్వహిస్తారు. ఈ రోజు సెప్టెంబర్ 28న గణేష్ లడ్డూని 1.25 కోట్ల రూపాయలకు వేలం వేశారు. గతంలో కూడా ఇక్కడ గణపతి లడ్డూ రికార్డు ధర పలికింది. గతేడాది దాదాపు రూ.65 లక్షలకు విక్రయించిన లడ్డూ ధర ఈ ఏడాది రెట్టింపు ధర పలికింది. లడ్డూ దాదాపు 12 కిలోల బరువు ఉంది. 11 రోజుల పాటు గణేశుడి వద్ద ఉంచిన లడ్డూ ద్వారా అదృష్టం, ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సును తెస్తుందని భక్తులు నమ్ముతారు.
ఇదిలా ఉండగా గణేష్ లడ్డూకి కోటి రూపాయలు వెచ్చించారు అంటే వాళ్ళు ఎంత రిచ్ అర్ధం అవుతుంది. నిజానికి రిచ్‌మండ్ విల్లాస్ లో ఒక్కో విల్లా రెండున్నర కోట్ల నుంచి 4 కోట్లు పలుకుతుంది. అందులో అన్ని 4BHK విల్లాలే. 3400 చదరపు అడుగుల నుంచి 5400 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ విశాలమైన ప్రదేశంలో ధనికులే ఉంటారు.
Also Read: Chandrayaan-3: చంద్రయాన్-3 చంద్రుని మీద అడుగుపెట్టలేదా?