Rakesh Sharma – 75 : రాకేష్ శర్మ 75వ బర్త్ డే.. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడి విశేషాలు
Rakesh Sharma - 75 : అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ.. ఈరోజు(జనవరి 13న) ఆయన 75వ పుట్టినరోజు.
- Author : Pasha
Date : 13-01-2024 - 9:20 IST
Published By : Hashtagu Telugu Desk
Rakesh Sharma – 75 : అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ.. ఈరోజు(జనవరి 13న) ఆయన 75వ పుట్టినరోజు. సోవియట్ యూనియన్‌కు చెందిన ‘సల్యుట్ 7’ అంతరిక్ష కేంద్రంలో రాకేష్ శర్మ 7 రోజుల, 21 గంటల 40 నిమిషాల పాటు గడిపి భారతదేశం గర్వించేలా చేశారు. రాకేష్ శర్మ పంజాబ్‌లోని పాటియాలాలో జన్మించారు. ఈయన హైదరాబాద్ నిజాం కాలేజీలోనూ ఉన్నత విద్యను అభ్యసించారు. చిన్నప్పటి నుంచి ఆయనకు మిలటరీలో చేరాలని ఉండేది. ఈ మక్కువతో రాకేష్ శర్మ మహారాష్ట్రలోని పూణేలో ఉన్న 35వ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో చేరారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), సోవియట్ ఇంటర్‌కోస్మోస్ స్పేస్ ప్రోగ్రామ్ ద్వారా వ్యోమగామిగా రాకేశ్ శర్మ కెరీర్ ప్రారంభమైంది. 1984 ఏప్రిల్ 3న ఆయన సోయుజ్ T-11 రాకెట్ ద్వారా ‘సల్యుట్ 7’ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. దీంతో అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయుడిగా ఆయన పేరు చరిత్రకెక్కింది. ‘‘అంతరిక్షం నుంచి భారతదేశం ఎలా కనిపించింది’’ అని రాకేష్ శర్మను అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. ‘‘సారే జహాన్ సె అచ్చా’’ అని బదులిచ్చారు. మాతృభూమిపై తన ప్రగాఢమైన దేశభక్తిని(Rakesh Sharma – 75) చాటుకున్నారు.
Also Read: 2024 Summer : ఈ ఏడాది సమ్మర్ ఎలా ఉండబోతోందో తెలుసా ?
- 1987లో వింగ్ కమాండర్‌గా రాకేష్ శర్మ పదవీ విరమణ చేశారు.
- అనంతరం ఆయన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)లో చీఫ్ టెస్ట్ పైలట్‌గా చేరారు.
- మిగ్-21 టెస్ట్ ఫ్లైట్ సమయంలో ఆయన ప్రాణాంతక సంఘటనను ఎదుర్కొన్నారు.
- 2001 సంవత్సరంలో టెస్ట్ ఫ్లైట్ సేవల నుంచి రిటైర్ అయిన తర్వాత రాకేష్ శర్మ తమిళనాడులోని కూనూర్‌లో స్థిరపడ్డారు. అక్కడ ఆయన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
- గోల్ఫ్, గార్డెనింగ్, యోగా, పుస్తకాలు చదవడం, ప్రయాణం చేయడం ఆయన అభిరుచులు.
- మీడియాలో కనిపించడం రాకేష్ శర్మకు ఇష్టముండదు.
- గగన్‌యాన్ కోసం ఇస్రో ఏర్పాటు చేసిన జాతీయ సలహా మండలిలోనూ ఆయన పనిచేశారు.
అభిమానుల తాకిడికి బట్టలు చిరిగిపోయేవి
కొన్ని సందర్భాల్లో అభిమానుల తాకిడికి రాకేశ్ శర్మ బట్టలు కూడా చినిగిపోయేవి. ఆటోగ్రాఫ్‌ల కోసం కేకలు వేసేవారు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం రాకేశ్‌ను ర్యాలీలకు ఆహ్వానించేవారు. రాకేశ్ శర్మ పాత రోజులను గుర్తు చేసుకుంటూ- “ఇది పూర్తిగా భిన్నమైన అనుభూతి. అభిమానుల క్రేజ్ చిరాకు వేసేది, విసిగిపోయేవాడిని. నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉండాల్సి వచ్చేది” అని చెప్పారు. 21 ఏళ్ల వయసులో రాకేష్ శర్మ భారత వైమానిక దళంలో చేరారు. అక్కడ ఆయన సూపర్ సోనిక్ జెట్ ఫైటర్ విమానాలను నడిపేవారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలోనూ సేవలందించారు. అప్పటికి రాకేశ్‌కు 23 ఏళ్లు కూడా లేవు. 25 ఏళ్లకే రాకేశ్ శర్మ ఎయిర్ ఫోర్స్‌లో ఉత్తమ పైలట్.అయితే రాకేశ్ శర్మ అంతరిక్ష యానం చేసిన 1984లో భారత్‌లో పరిస్థితులు ఏమంత బాగాలేవు. ఆ ఏడాది సిక్కు వేర్పాటువాదుల ఊచకోత జరిగింది. అంతేకాదు, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ గ్యాస్ ప్రమాదం కూడా అదే ఏడాది జరిగింది. ప్రపంచంలోని అత్యంత విషాదకర ఘటనగా ఈ ప్రమాదం నిలిచింది.