Water Cost : వాటర్ బాటిల్ ఇక్కడ రూ.16.. అక్కడ రూ.347.. ఎందుకు ?
Water Cost : మనదేశంలో ఉన్న నదులకు మనమంతా ఎంతో రుణపడి ఉండాలి. ఆ నదులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
- By Pasha Published Date - 03:45 PM, Sun - 29 October 23

Water Cost : మనదేశంలో ఉన్న నదులకు మనమంతా ఎంతో రుణపడి ఉండాలి. ఆ నదులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎందుకంటే.. ఆ నదుల వల్లే మనకు చౌకగా, అన్ లిమిటెడ్‌గా తాగునీరు, సాగునీరు లభిస్తోంది. తాగునీటినే చూసుకుంటే.. మన దేశంలో 330 మిల్లీలీటర్ క్వాంటిటీ కలిగిన వాటర్ బాటిల్ సగటు ధర దాదాపు 16 రూపాయలు ఉంది. ఇంతే క్వాంటిటీ కలిగిన వాటర్ బాటిల్ ధర మరో 94 దేశాల్లో మనం ఊహించలేనంత రేేంజ్‌లో ఉంది. ఆ దేశాల ప్రజలు డ్రింకింగ్ వాటర్ కోసం మన కంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
స్విట్జర్లాండ్‌లో 330 ml వాటర్ బాటిల్ రేటు ఎంతో తెలుసా ? రూ. 347. ఈ లెక్కన అక్కడ 1 లీటరు వాటర్ బాటిల్ కోసం రూ. 1000 దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మన ఇండియాలోనైతే సగటున 60 రూపాయలు ఖర్చుపెడితే సరిపోతుంది. ఇక 330 ml వాటర్ బాటిల్ ధర.. ఐరోపా దేశం లగ్జంబర్గ్‌లో రూ. 254, డెన్మార్క్‌లో రూ. 237, జర్మనీలో రూ.207, ఆస్ట్రియాలో రూ. 205, నార్వేలో రూ.205, బెల్జియంలో రూ.199, నెదర్లాండ్స్‌లో రూ.188, ఆస్ట్రేలియాలో రూ.175, ఫ్రాన్స్‌లో రూ.162.01 ఉంది. ఈమేరకు వివరాలతో numbeo.com అనే సంస్థ ఒక రిపోర్ట్ (Water Cost) రిలీజ్ చేసింది.
Also Read: Rahul – Farm Work : తలకు టవల్.. చేతిలో కొడవలి.. పొలం పనుల్లో రాహుల్
- నీటిని స్వచ్ఛంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో ఉన్న గంగానదిలో వందలాది తాబేళ్లను విడుదల చేస్తోంది. ఇందుకు అవసరమైన తాబేళ్లను.. వారణాసిలోని దేశంలోనే తొలి తాబేళ్ల పెంపకం కేంద్రం నుంచి సేకరిస్తున్నారు.
- నమామి గంగే కార్యక్రమంలో భాగంగా తాబేళ్లను గంగా నదిలోకి వదులుతున్నారు. సగం కాలిన శవాలు, కుళ్లిన మాంసాలు, విసిరిన పూల దండలతో గంగానది కలుషితమవుతోంది. 2017 నుంచి దాదాపు 5,000 తాబేళ్లను గంగానదిలోకి వదిలినట్లు తాబేళ్ల పునరావాస కేంద్రంలో పనిచేస్తున్న WII జీవశాస్త్రవేత్త ఆశిష్ పాండా తెలిపారు. 2017 నుండి దాదాపు 5,000 తాబేళ్లను విడుదల చేశామని ఆయన చెప్పారు. ఈ ఏడాది కూడా 1,000 తాబేళ్లను విడుదల చేయనున్నారు.