New Criminal Laws: జులై 1 నుంచి మూడు కొత్త న్యాయచట్టాలు.. వాటిలో ఏముంది ?
జులై 1 నుంచి భారత న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది.
- Author : Pasha
Date : 19-06-2024 - 1:25 IST
Published By : Hashtagu Telugu Desk
New Criminal Laws: జులై 1 నుంచి భారత న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. భారతీయ శిక్షాస్మృతి (1860), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్(1872), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1973) స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అనే మూడు చట్టాలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ మూడు చట్టాల్లో పలు నూతన విధానాలను ప్రవేశపెట్టామని కేంద్రప్రభుత్వం అంటోంది. ఈ చట్టాలపై ఇప్పటికే బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్‌డీ), జ్యుడీషియల్ అకాడమీలు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు అధికారులకు శిక్షణ ప్రారంభమైంది. ఈ మూడు కొత్త చట్టాలను(New Criminal Laws) గత ఏడాది పార్లమెంటు ఆమోదించగా 2023 డిసెంబర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.
We’re now on WhatsApp. Click to Join
భారతీయ న్యాయ సంహిత కీలక అంశాలివీ..
- భారతీయ న్యాయ సంహిత వేర్పాటువాద చర్యలు, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, దేశద్రోహం వంటి నేరాలకు విధించే శిక్షల గురించి తెలుపుతుంది.
- భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లు ఉంటాయి. ఇంతకుముందు ఐపీసీలో 511 సెక్షన్లు ఉండేవి.
- భారతీయ న్యాయ సంహితలో 20 కొత్త రకం నేరాలను చేర్చారు.
- 33 నేరాలకు జైలు శిక్షలను పెంచారు.
- 83 నేరాలకు జరిమానాలను పెంచారు.
- 23 నేరాలకు తప్పనిసరి కనీస శిక్షలు విధించేలా నిబంధనలు చేర్చారు.
- ఆరు నేరాలకు సమాజ సేవను శిక్షగా విధించనున్నారు.
- ఐపీసీలోని 19 సెక్షన్‌లు రద్దయ్యాయి.
Also Read :Skin Bank : భారత సైన్యం కోసం ‘స్కిన్ బ్యాంక్’
భారతీయ నాగరిక సురక్షా సంహిత కీలక అంశాలివీ..
- భారతీయ నాగరిక సురక్షా సంహితలో 531 విభాగాలు ఉంటాయి. అంతకుముందు సీఆర్పీసీలో 484 విభాగాలు ఉండేవి.
- ఈ బిల్లులో మొత్తం 177 నిబంధనలను మార్చారు.
- తొమ్మిది కొత్త సెక్షన్లతో పాటు 39 కొత్త సబ్ సెక్షన్లు చేర్చారు.
- 35 విభాగాలకు టైమ్‌లైన్‌లను జోడించారు.
- 35 ప్రదేశాలలో ఆడియో, వీడియో సదుపాయం వినియోగించే అంశాన్ని జోడించారు.
- ఈ బిల్లులో మొత్తం 14 సెక్షన్లను తొలగించారు.
- భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సాధారణ క్రిమినల్ చట్టాల కింద నేరం తీవ్రతను బట్టి పోలీసు కస్టడీ వ్యవధిని 15 రోజుల నుంచి 90 రోజుల వరకు పొడిగించారు.
Also Read :Space Elevator : ఆకాశానికి లిఫ్ట్.. భూమి నుంచి ఉపగ్రహం వరకూ కేబుల్
భారతీయ సాక్ష్యా అధినియం కీలక అంశాలివీ..
- భారతీయ సాక్ష్యా అధినియం ఇప్పుడు 170 నిబంధనలను కలిగి ఉంది. గతంలో ఇండియన్ ఎవిడెన్స్ యాక్టులో 167 నిబంధనలు ఉండేవి.
- ఇందులోని 24 నిబంధనలు మార్పులకు గురయ్యాయి. రెండు కొత్త నిబంధనలు, ఆరు ఉప నిబంధనలను చేర్చారు.
- ఆరు నిబంధనలను రద్దు చేశారు.
- వలసరాజ్యాల కాలపు నిబంధనలను ఇండియన్ ఎవిడెన్స్ యాక్టులో ఉండేవి. వాటికి భారతీయ సాక్ష్యా అధినియంలో చోటు లేకుండా చేశారు.