Houses On The Moon : చంద్రుడిపైకి ఇళ్లు కట్టే ‘3డీ ప్రింటర్’.. ప్రయోగానికి ముహూర్తం ఖరారు
Houses On The Moon : చంద్రుడిపై ఇళ్లను కట్టేందుకు నాసా కసరత్తు చేస్తోంది.
- Author : Pasha
Date : 04-10-2023 - 3:01 IST
Published By : Hashtagu Telugu Desk
Houses On The Moon : చంద్రుడిపై ఇళ్లను కట్టేందుకు నాసా కసరత్తు చేస్తోంది. 2040 నాటికి అక్కడ మనిషికి ఆవాసాన్ని రెడీ చేయాలనే లక్ష్యంతో ప్లానింగ్ ను రెడీ చేస్తోంది. జాబిల్లిపై త్రీడీ ఇళ్లు కట్టేందుకు అవసరమైన త్రీడీ ప్రింటర్‌ను వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో చంద్రుడిపైకి పంపుతామని నాసా అంటోంది. అదే జరిగితే.. చంద్రుడిపై భూమి వాతావరణానికి అనుగుణమైన ఆవాసాలు రెడీ అయితే.. వాటిలో ఉంటూ మనుషులు ఎక్కువ కాలంపాటు అక్కడ రీసెర్చ్ చేసే వెసులుబాటు కలుగుతుంది. ఈమేరకు వివరాలతో న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. చంద్రుడిపై ఉన్న రాక్ చిప్స్, ఖనిజాలను ఉపయోగించి ఇళ్లను నిర్మించే టెక్నాలజీతో తయారుచేసిన 3డీ ప్రింటర్ ను వచ్చే ఏడాది చంద్రుడిపైకి పంపేందుకు నాసా సన్నాహాలు మొదలుపెట్టిందని ఆ కథనంలో ప్రస్తావించారు.
We’re now on WhatsApp. Click to Join
దీనికి సంబంధించి కొన్ని టెక్ కంపెనీలకు నాసా సబ్ కాంట్రాక్టులు కూడా కేటాయించిందని పేర్కొన్నారు. ‘‘ఆక్సిజన్, ఐరన్, సిలికాన్, అల్యూమినియంలను వెలికితీసి.. సోలార్ సెల్స్, వైర్లు ఉత్పత్తి చేసే పనులను బ్లూ ఆరిజిన్ కంపెనీకి నాసా కేటాయించింది. జాబిల్లిపై రాళ్లు తొలగించడం, వదులుగా ఉండే మట్టిని గట్టిగా చేసి కరిగించి ఘన ఉపరితలంగా మార్చడానికి ఉపయోగించే యంత్రాల అభివృద్ధి బాధ్యతలను రెడ్‌వైర్ అనే సంస్థకు అప్పగించింది. ఉష్ణోగ్రతలతో సంబంధం లేకుండా స్థిరంగా కొనసాగే రేడియో ఐసోటోపిక్ విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి జెనోపవర్ సిస్టమ్స్‌ను నాసా ఎంపిక చేసింది’’ అని కథనంలో ప్రస్తావించారు.
ఆర్టెమిస్-2, ఆర్టెమిస్-3
ఈ మిషన్ కంటే ముందు ఆర్టెమిస్-2, ఆర్టెమిస్-3 ప్రయోగాలను చేపట్టేందుకు నాసా రెడీ అవుతోంది. ఇంతకుముందు చేపట్టిన ఆర్టెమిస్-1 మిషన్ ఫెయిల్ అయింది. దీంతో ఆర్టెమిస్-2 మిషన్‌లో నలుగురు వ్యోమగాముల్ని పంపించనుంది. ఇది విజయవంతమైతే.. 2025 లేదా 2026లో ఆర్టెమిస్-3 మిషన్ (Houses On The Moon) ద్వారా ఒక మహిళతో పాటు నలుగురు వ్యోమగాములతో చంద్రుని దక్షిణ ధృవంపైకి పంపనుంది.