Planets: మర్చి 28న రాత్రి ఆకాశంలో అద్భుతం.. ఒకేసారి ఐదు గ్రహాలు మనకు కనిపించబోతున్నాయి..
ఆకాశంలో అరుదైన, అద్భుతమైన దృశ్యం మరోసారి ఆవిష్కృతం కానుంది. ఈ నెల 28న రాత్రి నింగి వైపు తప్పకుండా ఒక్కసారి చూడండి. వీలుంటే మంచి పవర్ ఫుల్ బైనాక్యులర్..
- By Maheswara Rao Nadella Published Date - 01:16 PM, Mon - 27 March 23
5 Planets : ఆకాశంలో అరుదైన, అద్భుతమైన దృశ్యం మరోసారి ఆవిష్కృతం కానుంది. ఈ నెల 28న రాత్రి నింగి వైపు తప్పకుండా ఒక్కసారి చూడండి. వీలుంటే మంచి పవర్ ఫుల్ బైనాక్యులర్ రెడీగా ఉంచుకోండి. ఐదు గ్రహాలు (5 Planets) ఒకే రోజు దర్శనం ఇవ్వనున్నాయి. గురుడు, బుధుడు, శుక్రుడు, యురేనస్, అంగారకుడు సమీపానికి రానున్నారు. వీటికి చంద్రుడు అదనంగా కనిపిస్తాడు.
‘‘సూర్యాస్తమం తర్వాత పశ్చిమం వైపు చూడాలి. 50 డిగ్రీల పరిధిలో ఈ ఐదు గ్రహాలు కనిపిస్తాయి. ఇందులో గురుడు, శుక్రుడు, అంగారకుడిని మన కళ్లతోనే చూడొచ్చు. బుధగ్రహం, యురేనస్ ను మాత్రం బైనాక్యులర్ ద్వారానే చూడగలరు’’ అని నాసాకు చెందిన బిల్ కూక్ సూచించారు. 2022 జూన్ లోనూ ఇలాంటి అద్భతమే ఒకటి కనిపించింది. నాడు బుధగ్రహం, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని ఒకే లేఖనంపైకి వచ్చారు. అమెరికా మాజీ ఖళోగ శాస్త్రవేత్త, చంద్రుడిపై నడిచిన తొలి వ్యొమగామి అయిన డాక్టర్ బజ్ ఆల్డ్రిన్ కూడా 28న రాత్రి ఆకాశం వైపు చూడాలని సూచించారు.
Also Read: Shikhar Dhawan: 15 ఏళ్ల వయసులోనే నేను హెచ్ఐవీ టెస్టు చేయించుకున్నా.. శిఖర్ ధావన్
Related News
AP Inter Result 2024: ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు రేపే విడుదల
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఎట్టకేలకు ఇంటర్ బోర్డు రేపు ప్రకటించనుంది. ప్రథమ, ద్వితీయ పరీక్షలకు హాజరైన విద్యార్థులు శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఫలితాలను చూసుకోవచ్చు