Divorce in 3 Minutes : పెళ్ళైన నిమిషాల వ్యవధిలో విడాకులు తీసుకున్న జంట.. ఎందుకలా..?
(Divorce in 3 Minutes) నిండు నూరేళ్లు కలిసి ఉండాలని వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన ఓ జంట అలా పెళ్లి చేసుకుని ఇలా బయటకు వచ్చారో
- Author : Ramesh
Date : 21-09-2023 - 1:23 IST
Published By : Hashtagu Telugu Desk
(Divorce in 3 Minutes) నిండు నూరేళ్లు కలిసి ఉండాలని వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన ఓ జంట అలా పెళ్లి చేసుకుని ఇలా బయటకు వచ్చారో లేదో తూచ్ నాకు ఈ భార్య వద్దని అతను.. నాకే ఈ భర్త వద్దని వధువు అనుకున్నారు. దాంతో మ్యాటర్ లాయర్ దగ్గరకు వెళ్లి డైవర్స్ తీసుకునే దాకా వచ్చింది. పెళ్లై జస్ట్ మూడంటే మూడే నిమిషాలు కలిసి ఉన్నారు ఈ జంట. అసలు ఇంతకీ అంత సడెన్ గా వాళ్లిద్దరు ఎందుకు విడిపోవాలని అనుకున్నారు అంటే. అలా పెళ్లై ఇలా బయటకు వస్తున్న పెళ్లి కూతురు కాలు జారికిందపడిందట.
ఏదో కాలు జారి పడింది కదా అని లేపడం వదిలేసి స్టుపిడ్ అంటూ ఆమెపై అరిచేశాడట వరుడు. దాంతో ఆమెకు కోపం వచ్చి కింద పడితే లేపాల్సింది పోయి స్టుపిడ్ అంటున్న ఇతనితో తను కాపురం చేయడం కుదరదని తేల్చి చెప్పేసిందట. మధ్యవర్తులు ఎంత ప్రవర్తించినా సరే వాళ్లని కన్విన్స్ చేయడం కుదరలేదట. ఇక చేసేదేమి లేక వాళ్లిద్దరికి విడాకులు ఇచ్చేశారట లాయర్.
ఈ సంఘటన ఇటీవలే కువైట్ లో జరిగింది. పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తారనుకున్న జంట కాస్త వారి ఈగోలకు పోయి పెళ్లి పెటాకులు చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన నెటినలు వాడిని వదిలేసి మంచి పనిచేశావని వధువుకి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇలానే 2019లో ఒక వివాహం బంధం గంటల వ్యవధి (Divorce in 3 Minutes)లో కాదనుకున్నారు ఒక జంట. ఆ పెళ్లిలో మధ్యాహ్న భోజనం టైం లో జరిగిన గొడవ వల్ల వధూవరులు విడిపోవాల్సి వచ్చింది.
ఇలాంటి గొడవల్లో వధువు వరుడు చుట్టుపక్కన ఉన్న వాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. పెళ్లితో ఒకటై నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాల్సిన పెళ్లి జంట ఇలా చిన్న చిన్న కారణాల వల్ల విడిపోవడం చూసి అందరు ఏటు వెళ్తుంది ఈ లోకం తీరు అనుకుంటున్నారు.
Also Read : BiggBoss7 : అతన్ని హీరో చేస్తున్న కంటెస్టెంట్స్..!