Most Weak Currencies : ప్రపంచంలోనే వీక్ కరెన్సీలు ఏమిటో తెలుసా ?
Most Weak Currencies : ప్రపంచంలోని పవర్ ఫుల్, అత్యంత విలువైన కరెన్సీల గురించి అందరికీ తెలుసు.
- By Pasha Published Date - 12:44 PM, Sun - 3 September 23
Most Weak Currencies : ప్రపంచంలోని పవర్ ఫుల్, అత్యంత విలువైన కరెన్సీల గురించి అందరికీ తెలుసు.
కానీ చాలా వీక్ కరెన్సీలు, అత్యంత తక్కువ విలువ కలిగిన కరెన్సీల గురించి చాలామందికి తెలియదు.
ఇప్పుడు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Also read : Delhi Liquor: ఢిల్లీ సరికొత్త రికార్డు.. ఏడాది కాలంలోనే రూ.7,285 కోట్ల మందు తాగేసిన మద్యం ప్రియులు..!
ఇరాన్ రియాల్
ప్రపంచంలోనే అత్యంత తక్కువ విలువ కలిగిన కరెన్సీలలో ఇరాన్ రియాల్ టాప్ ప్లేస్ లో ఉంది. ఒక ఇరాన్ రియాల్ విలువ మన ఇండియా కరెన్సీలో కేవలం 20 పైసలు మాత్రమే. ఇరాన్ వ్యాపారం, తలసరి జీడీపీపరంగా చాలా వెనుకబడిన దేశం. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చమురు, వ్యవసాయంపైనే ఆధారపడి నడుస్తోంది. ప్రపంచంలోనే ఎక్కువ కరెన్సీ విలువ కలిగిన దేశం.. కువైట్. ఒక కువైట్ దినార్ అనేది మన దేశానికి చెందిన 268 రూపాయలకు సమానం. ఒమన్ రియాల్ కూడా చాలా స్ట్రాంగ్. మన దేశానికి చెందిన 1 రూపాయి 516 ఇరానియన్ రియాల్స్ కు సమానం.
వియత్నామీస్ డాంగ్
ప్రపంచంలోనే రెండో బలహీనమైన కరెన్సీ వియత్నామీస్ డాంగ్. 1 రూపాయికి మీరు 284 వియత్నామీస్ డాంగ్‌లను కొనొచ్చు.
సియెర్రా లియోన్ SLL
ప్రపంచంలోనే మూడో బలహీనమైన కరెన్సీ సియెర్రా లియోన్ కు చెందిన సియెర్రా లియోనియన్ లియోన్ (SLL). మీరు 1 రూపాయికి 278 SLLలను కొనొచ్చు. ఈ దేశం డైమండ్ మైనింగ్‌కు ఫేమస్.
లావోషియన్ కిప్
ప్రపంచంలోనే నాలుగో బలహీన కరెన్సీ లావో. దీన్నే లావోషియన్ కిప్ (LAK) అని కూడా పిలుస్తారు. ఇక్కడ తలసరి GDP 1875 డాలర్లు మాత్రమే. ఈ ఆర్థిక వ్యవస్థ 50 శాతం వ్యవసాయంపై, 40 శాతం పరిశ్రమలపై, 10 శాతం సేవలపై ఆధారపడి ఉంది. మనం 1 రూపాయికి 239 లాక్‌లను కొనొచ్చు.
ఇండోనేషియా రూపాయి
ఇండోనేషియా రూపాయి (IDR) కూడా బలహీన కరెన్సీయే. ఈ దేశం మన కంటే చాలా వెనుకంజలో (Most Weak Currencies) ఉంది. మనం 1 రూపాయికి 184 ఐడీఆర్ లను కొనొచ్చు.
Related News
10 Strongest Currencies : టాప్-10 పవర్ఫుల్ కరెన్సీల లిస్టు ఇదే.. ఇండియా ర్యాంక్ తెలుసా ?
10 Strongest Currencies : ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్ ప్రపంచంలోని 10 బలమైన కరెన్సీల జాబితాను విడుదల చేసింది.