Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతి.. ఆయన జీవితపు ముఖ్య ఘట్టాలివీ
అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబరు 25న జన్మించారు.
- By Pasha Published Date - 08:38 AM, Wed - 25 December 24

Atal Bihari Vajpayee : ఇవాళ భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి. ఆయన పదవుల కోసం, పేరు కోసం, డబ్బు కోసం ఎన్నడూ పాకులాడలేదు. మన దేశాన్ని ఐదేళ్లు పాలించిన మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా వాజ్‌పేయి చరిత్రకెక్కారు. ఇవాళ వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలుసుకుందాం..
Also Read :Srikakulam Sherlockholmes Review & Rating : శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రివ్యూ
- అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబరు 25న జన్మించారు. ఆయన తల్లి పేరు కృష్ణదేవి, తండ్రి పేరు కృష్ణబిహారీ వాజ్‌పేయి.
- అటల్ బిహారీ వాజ్‌పేయి తండ్రి కృష్ణబిహారీ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆయన కవి కూడా. అందుకే కవిత్వం అనేది అటల్‌కు సహజంగా అబ్బింది.
- అటల్ బిహారీ వాజ్‌పేయి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లలో చదువుకున్నారు.
- వాజ్‌పేయి అవివాహితుడు. గ్వాలియర్‌లోని విక్టోరియా కాలేజీలో తనతో కలిసి చదువుకున్న రాజ్‌కుమారి కౌల్ కుమార్తె నమితను ఆయన దత్తత తీసుకున్నారు. వాజ్‌పేయీ అంత్యక్రియలను ఆమె నిర్వహించారు.
- కొంతకాలం పాటు అటల్ జర్నలిస్టుగా పనిచేశారు.
- కొద్దికాలం పాటు జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీకి రాజకీయ కార్యదర్శిగా అటల్ బిహారీ వాజ్‌పేయి పనిచేశారు.
- వాజ్‌పేయీ తొలి ప్రజా జీవన ప్రస్థానం గ్వాలియర్‌లో ఆర్య కుమార్ సభలో చేరడంతో ప్రారంభమైంది.
- 1939లో ఆర్ఎస్ఎస్‌లో వాజ్‌పేయి చేరారు.
- 16ఏళ్ల వయసులో(1942 నాటికి) సంఘ్ క్రియాశీల కార్యకర్తగా మారారు.
- 1944 నాటికి ఆర్య కుమార్ సభకు ప్రధాన కార్యదర్శి అయ్యారు.
- 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమంలో తన సోదరుడితో కలిసి వాజ్‌పేయి అరెస్టయ్యారు. 24రోజులు జైలులో ఉన్నారు.
- 1951లో కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్ కార్యదర్శి బాధ్యతలను వాజ్‌పేయీ చేపట్టారు. 1968 నుంచి 72 వరకూ జనసంఘ్ అధ్యక్షుడిగా సేవలందించారు.
- 1957లో ఉత్తరప్రదేశ్‌లోని మథుర, బలరాంపుర్ నుంచి లోక్‌సభకు వాజ్‌పేయి పోటీ చేశారు. మథురలో ఓడిపోగా బలరాంపుర్‌లో గెలిచారు. అప్పటి నుంచి 10 సార్లు లోక్‌సభకు గెలిచిన ఆయన 5 దశాబ్దాలపాటు ఎంపీగా కొనసాగారు.
- వాజ్‌పేయి రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు.
- 1977లో జనతా పార్టీలో జనసంఘ్ విలీనమైంది. అదే ఏడాది మార్చిలో వాజ్‌పేయీ భారత విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Also Read :Foods Avoid With Eggs: మీరు గుడ్లను ఈ ఫుడ్స్‌తో కలిపి తింటున్నారా..?
- 1977లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో వాజ్‌పేయి హిందీలో ప్రసంగించారు. అక్కడ హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తి ఆయనే.
- జనతా పార్టీ చీలిపోయాక 1980లో తన చిరకాల సహచరుడు అద్వానీతో కలిసి బీజేపీని వాజ్‌పేయి స్థాపించారు. ఆ పార్టీకి తొలి అధ్యక్షుడిగా ఆయనే ఎన్నికయ్యారు.
- 1996 ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో వాజ్‌పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ 13 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది.
- 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారం చేపట్టింది. ప్రధాని అభ్యర్థిగా వాజ్‌పేయి ఉండటంతో కొన్ని పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో ఆయన ప్రధాని అయ్యారు. అన్నా డీఎంకే 13 నెలల తర్వాత మద్దతు ఉపసంహరించుకోవడంతో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయింది.
- కార్గిల్ యుద్ధం తర్వాత 1999లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 303 సీట్లను గెలుచుకుంది. వాజ్‌పేయీ మూడోసారి ప్రధాని అయ్యారు. ఐదేళ్లపాటు ప్రభుత్వం కొనసాగింది.
- 1998 మే నెలలో వాజ్‌పేయి ప్రభుత్వం పోఖ్రాన్ అణు పరీక్షలను నిర్వహించి ప్రపంచానికి సత్తా చాటింది.
- 2004 ఎన్నికల్లో వాజ్‌పేయి, అద్వానీ మధ్య నాయకత్వ సంక్షోభం తలెత్తింది. దీంతో అప్పటి ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది.
- వాజ్‌పేయీ అనారోగ్యంతో రాజకీయాలకు దూరమయ్యారు.