Srikakulam Sherlockholmes Review & Rating : శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రివ్యూ
- By Ramesh Published Date - 08:05 AM, Wed - 25 December 24

Srikakulam Sherlockholmes Review & Rating స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ లీడ్ రోల్ లో రచయిత మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఈ సినిమాలో అనన్యా నాగళ్ల, రవితేజ కూడా నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా క్రైం నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
గ్రామంలో జరుగుతున్న వరుస హత్యల చిక్కు ముడి విప్పేందుకు పోలీసులు తమ ప్రయత్నం చేసి విఫలమవుతుండగా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ గా పేరు తెచ్చుకున్న డిటెక్టివ్ కి ఈ మిస్టరీని చేధించే బాధ్యత అప్పగిస్తారు. మరి ఆ డిటెక్టివ్ ఈ హత్య్ల వెనక ఉన్నది ఎవరన్నది ఎలా కనిపెట్టాడు..? దానికి రీజన్స్ ఏంటి..? అన్నది సినిమా కథ.
విశ్లేషణ :
డిటెక్టివ్ నేపథ్యంతో ఇదివరకు చాలా సినిమాలు వచ్చాయి. వాటి లానే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కూడా ఆకట్టుకునే కథ కథనలాతో వచ్చింది. ఎప్పుడైనా ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు ఆడియన్ కథకు ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే అందుకు తగినట్టుగా టైట్ స్క్రీన్ ప్లే ఉండాలి. ఐతే ఇనాటి డిటెక్టివ్ తరహా సినిమాలు అన్నీ సీరియస్ గా వెళ్తుంటాయి. కానీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మాత్రం ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్లారు.
ఒక మిస్టరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రేమ కథ ఇలా అన్ని కలిపి చెప్పారు. ఐతే మధ్యలో కాస్త డ్రామా ఎక్కువన్నట్టు అనిపించినా కూడా అది సినిమాకు పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. డిటెక్టివ్ పాత్ర తెర మీద కనిపించిన ప్రతిసారి వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను అలరిస్తాయి.
కథకు తగినట్టుగా ఆకట్టుకునే కథనంతో ఎంతో ఆసక్తిగా నడిపించారు. ఇక క్లైమాక్స్ కూడా ఎవరు ఊహించని విధంగా తీసుకెళ్లారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను అలరించేలా తీర్చిదిద్దారు.
నటన & సాంకేతిక వర్గం :
వెన్నెల కిశోర్ ఎలాంటి పాత్ర ఇచ్చినా అవలీలగా చేస్తాడు. టిటెక్టివ్ పాత్రలో ఇంకా ఎక్కువ ప్రతిభ కనబరిచేలా చేశాడు. ఆ పాత్రలో కలవర్ నెస్, ఎమోషన్స్ రెండిటితో ప్రేక్షకులను అలరించారు. అనన్యా నాగళ్ల, రవి కూడా తమ పాత్రలకు మంచి న్యాయం చెశారు. మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే.. దర్శకుడు రచయిత మోహన్ ఇది కేవలం డిటెక్టివ్ కథగా కాకుండా మానవ సంబంధాల లోతులు టచ్ చేస్తూ మంచి ప్రతిభ కనబరిచాడు. కథలోని అన్ని ఎమోషన్స్ బాగున్నాయి. సినిమా కెమెరా వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ సూపర్. మ్యూజిక్ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.
బాటం లైన్ :
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్.. అలరించే మంచి ఎంటర్టైనర్..!
రేటింగ్: 3/5