EGGS : గుడ్లు…అసలు, నకిలీ అని ఎలా గుర్తించాలి…? హైదరాబాదీలు రోజుకు ఎన్ని గుడ్లు తింటున్నారో తెలుసా?
- By hashtagu Published Date - 10:15 AM, Wed - 2 November 22

కాలం ఏదైనా సరే గుడ్లకు గిరాకీ మామూలుగా ఉండదు. చలికాలం అయితే కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే గుడ్డులో ప్రొటిన్,కాల్షియం, ఒమేగా 3 పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అందుకే ప్రజలు గుడ్లు తినేందుకు ఇష్టపడుతుంటారు. అంతేకాదు కోవిడ్ కారణంగా గుడ్లు తినేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే మీరు మార్కెట్ కు వెళ్లినప్పుడు గుడ్లు కొనుగోలు చేసేటప్పుడు..అసలు గుడ్లు, నకిలీ గుడ్లు వీటిని గమనించండి. ఎందుకంటే మార్కెట్లో లభించే నకిలీ గుడ్లు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
దేశంలో రోజుకు లక్షల కోట్లలో గుడ్ల వ్యాపారం జరుగుతుందంటే మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే గుడ్లను ఉత్పత్తి చేయడంలో భారత్ మూడో స్థానంలో ఉంది. అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2020-21 మధ్యకాలంలో భారత్ లో 122.05 బిలియన్ గుడ్లు ఉత్పత్తి అయ్యాయి. భారత్ లో గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులు ముందంజలో ఉన్నాయి. గుడ్ల వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఒక హైదరాబాద్ లోని రోజుకు 75లక్షల కోడిగుడ్లు వినియోగిస్తున్నట్లు ఓ రిపోర్టు వెల్లడించింది.
నకిలీ
గుడ్లకు భారీగా డిమాండ్ ఏర్పడటం వల్ల కొంతమంది వ్యాపారులు దీనిని క్యాష్ చేసుకుంటున్నారు. గత కొనాళ్లుగా మార్కెట్లో నకిలీ కోడిగుడ్లను విక్రయిస్తున్న కేసులు పెరిగాయి. అయితే మీరు నకిలీ, అసలు గుడ్డు మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలంటే..నకిలీ గుడ్డు, నిజమైన గుడ్డుకంటే ప్రకాశవంతంగా ఉంటుంది. గుడ్డును చూసి నిజమైందే అనుకోని కొనుగోలు చేస్తారు.
తేడా ఎలా గుర్తించాలి.
నకిలీ గుడ్లను తయారు చేసేటప్పుడు దాని షెల్ కోసం ప్లాస్టిక్ ఉపయోగిస్తారు. ఈ గుడ్డును అగ్గులపై వేస్తే అది ప్లాస్టిక్ కాలిన వాసన వస్తుంది. దానితో పాటు మంటలు కూడా వస్తాయి. అంతేకాదు అసలు గుడ్డును ఊపుతే ఎలాంటి శబ్దం రాదు. నకిలి అయితే లోపల నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది. మీరు మార్కెట్లో గుడ్లను కొనుగోలు చేసేటప్పుడు ఇలా ప్రయత్నించి చూడండి.