Foreign Jobs: నర్సులకు గుడ్ న్యూస్.. విదేశాల్లో జాబ్స్ కోసం స్పెషల్ డ్రైవ్!
USA, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, UK, జర్మనీ, ఇతర యూరప్ దేశాల్లో నర్సులకు డిమాండ్ ఉంది.
- Author : Balu J
Date : 10-06-2023 - 12:05 IST
Published By : Hashtagu Telugu Desk
విదేశాల్లో నర్సింగ్ కు ఎక్కడాలేని డిమాండ్ ఉంది. అందుకే పలు కంపెనీలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ రిక్రూట్ మెంట్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) జూన్ 12 నుండి 16 వరకు విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం నర్సులకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌లను నిర్వహించనుంది. USA, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, UK, జర్మనీ, ఇతర యూరప్ వంటి దేశాలలో నర్సులు, ఆరోగ్య సంరక్షణ కార్మికుల కోసం డిమాండ్ ఉంది.
అందువల్ల TOMCOM ఈ దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ నమోదిత ఏజెన్సీలతో భాగస్వామ్యమై క్యాంపస్ ప్లేస్ మెంట్ మాదిరిగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తునాయి. శిక్షణ, భాషా నైపుణ్యాలను అందిస్తూ అర్హత కలిగిన అభ్యర్థులకు విదేశీ ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. జూన్ 12న హైదరాబాద్‌లోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో డ్రైవ్ నిర్వహించనున్నారు. అదే విధంగా జూన్ 14న జగిత్యాలలోని ధరూర్ క్యాంపులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో డ్రైవ్ నిర్వహిస్తారు.
రాజన్న సిరిసిల్లలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల శాంతి నగర్‌లో జూన్ 15; జూన్ 16న చల్మెడ ఆనంద్ రావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బొమ్మకల్, కరీంనగర్ లాంటి ఏరియాల్లో డ్రైవ్ ఉంటుంది. ఆసక్తిగల నర్సులు తమ రెజ్యూమ్‌లు, సంబంధిత డాక్యుమెంట్‌లతో డ్రైవ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఆసక్తి గలవారు 6302292450 లేదా 7893566493కు కాల్ చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం వారి వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Also Read: Bhagavanth Kesari: బాలయ్య బాబు ఊచకోత షురూ.. మాస్ ఎలిమెంట్స్ తో ‘భగవంత్ కేసరి’ టీజర్