News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Special News
  • ⁄Dokka Seethamma Queen Of Anna Danam Remembered

Special Story: చరిత్రలో డొక్కా సీతమ్మ.!

ఇటువంటి మహానుభావురాలు మన తెలుగింటి ఆడపడుచు అయినందుకు ఎంతో గర్వంగా ఉంది.

  • By CS Rao Published Date - 09:50 AM, Fri - 29 April 22
Special Story: చరిత్రలో డొక్కా సీతమ్మ.!

ఇటువంటి మహానుభావురాలు మన తెలుగింటి ఆడపడుచు అయినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఆమె అన్నదానం చేసిన చరిత్ర ఇప్పటికీ చెక్కుచెదరక పోవటం ఆంద్రప్రదేశ్ ఔదార్యాన్ని చాటుతోంది. ఆమె ఎవరో కాదు డొక్కా సీతమ్మ. ఇవాళ ఆమె వర్ధంతి సందర్భంగా ఒక వ్యాసం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది యధాతధంగా ఇలా ఉంది.

తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అని ఒక మహాతల్లి ఉండేవారు. ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కూడా కట్టారు. ఆవిడ గొప్ప నిరతాన్నదాత. వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆవిడ ధృతి, దీక్ష ఎంత గోప్పవంటే – ఆవిడ జీవితములో ఒకేఒక్కసారి అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికని బయలుదేరారు. బయలుదేరి, గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు. ఆవిడ పల్లకిలో కూర్చునారు, బోయీలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అటుగా పి.గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే, పెద్దవాళ్ళు “ఒక్క అరగంట లో గన్నవరం వెళ్లీపోతాం… అక్కడ సీతమ్మ గారు మనకు అన్నం పెడతారు” అని మాట్లాడుకోవటం విన్నారు సీతమ్మగారు. వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళటం మానేసి, పల్లకి వెనక్కి తిప్పెయ్యండి… వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు. అంతటి నిరతాన్న దాత ఆవిడ.

ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే, అందరికీ పెట్టి పెట్టి, ఆ దంపతులకి తినటానికి ఏమీ లేకుండా పోయింది. ఒకానొకప్పుడు ఆవిడ భార్తగారు “ఎందుకు ఇంకా ఈ అన్నదానం? మనకి కూడా తినటానికి ఏమీ లేదు. వచ్చి ఎవరైనా తలుపుకొడితే సిగ్గేస్తోంది! పెట్టడమా మానవు! ఇంత అన్నం పప్పైనా పెడతావు…” అన్నారు. దానికి ఆవిడ “నేను నిస్వార్థముగా పెట్టేటప్పుడు, వచ్చిన వారు తింటున్నప్పుడూ వచ్చినదీ, తింటున్నదీ శ్రీ మహా విష్ణువని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు? మనకీ వాడే పెడతాడు” అని చెప్పి పెట్టింది. ఇన్నాళ్ళ నుంచీ దున్నుతున్న అదే పొలానికి వెళ్లి సీతమ్మ గారి భర్త ఒక రోజు సాయంకాలం గొయ్యి తవ్వుతున్నారు. గునపానికి ఏదో తగిలి ఖంగుమంది. ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది. బిందె మూత తీస్తే, దాని నిండా బంగారు నాణాలే. తీసుకొచ్చి ఇంట్లో బంగారు కాసుల రాశులు పోసి, మళ్లీ రొజూ కొన్ని వందల మందికి అన్నదానం చేసారు.

ఆశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలక్టరుకి డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని ఉత్తరం వ్రాసాడు. దేనికి అంటే “నాకు పట్టాభిషేకము జరిగేటప్పుడు ఆవిడకు నమస్కారం పెట్టాలి. కానీ ఆవిడ సముద్రము దాటి రారు కాబట్టి, ఆ సమయములో ఒక సోఫా వేసి, ఆవిడ ఫోటో అందులో పెట్టి, ఆవిడకు నమస్కారము పెట్టి అప్పుడు పట్టాభిషేకము చేసుకుంటా” అని వ్రాసాడు. తూర్పు గోదావరి జిల్లా కలక్టరు గారు ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్తే, “నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు. విష్ణు మూర్తికి అన్నం పెడుతున్నాని పెట్టాను. దీనికి ఫోటోలు పట్టభిషేకలు ఎందుకు, వద్దు” అన్నారు ఆవిడ. “అమ్మ ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం. మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు” అని ఆ కలక్టరు గారు చెబితే, “నీ ఉద్యోగం పోతుంది అంటే, తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి” అని తీయించుకున్నారు ఆవిడ. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి, నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. ఒక మనిషి నిస్వార్థముగా, ధృతితో, పట్టుదలతో లక్ష్య సిద్ది కోసం పాటుపడితే, వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు, వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం!

Tags  

  • anna daanam
  • anniversary
  • dokka seethamma
  • philanthropist

Related News

    Latest News

    • Tamannaah Beauty Secret: మిల్కీ బ్యూటీ తమన్నా స్కిన్ మెరుపు సీక్రెట్ ఇదే…మీరు ఫాలో అయిపోండి…

    • Summer Health Drink: మజ్జిగలో త్రిఫల చూర్ణం కలిపి తాగితే ప్రయోజనాలు ఇవే..వేసవిలో అద్భుతమైన డ్రింక్…

    • Lakshmi Puja: మే 20 జ్యేష్ఠ శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే..అప్పులు తీరి, సకల సంపదలు చేకూరుతాయి…

    • Hyderabad Beats Mumbai: థ్రిల్లింగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం.. ముంబై చిత్తు!!

    • Angry Bride: వికటించిన డీజే, ముహూర్తానికి మండపం చేరుకోని వరుడు, కోపం మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న వధువు…

    Trending

      • Tomato Prices: టమాట.. తినేటట్టు లేదు!

      • Skyfall in Gujarat: గుజరాత్ లో ‘లోహపు’ బంతుల వర్షం.. రంగంలోకి ఇస్రో!

      • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

      • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

      • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    • Copyright © 2022 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam
    • Follow us on: