Bigg Boss 7 : ఈసారి టాప్ 5 లో అతను పక్కానా..?
బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 6 అనుకున్నంతగా సక్సెస్ అవకపోవడంతో సీజన్ 7 మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు.
- Author : Ramesh
Date : 18-09-2023 - 9:52 IST
Published By : Hashtagu Telugu Desk
Top 5 in Bigg Boss Season 7 : బిగ్ బాస్ సీజన్ 6 అనుకున్నంతగా సక్సెస్ అవకపోవడంతో సీజన్ 7 మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈసారి బిగ్ బాస్ ఉల్టా పుల్టా అంటూ ఎవరు ఊహించని విధంగా ఉంటుందని చెబుతూ వస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Season 7) ను కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారని తెలిసిందే. ఉల్టా పుల్టాలో భాగంగా హౌస్ లోకి వెళ్లిన వారంతా కంటెస్టెంట్స్ మాత్రమే కానీ హౌస్ మెట్స్ గా వారు టాస్క్ లు గెలవాల్సి ఉంటుందని అన్నారు. మొదటి వారం సందీప్ పవర్ అస్త్ర సంపాదించుకున్నాడు. అతనికి ఐదు వారాల ఇమ్యూనిటీ తో పాటుగా కొన్ని టాస్కుల్లో అతను కూడా ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఇచ్చారు.
ఇక రెండో వారం రెండో పవర్ అస్త్ర కోసం మిగిలిన కంటెస్టెంట్స్ ప్రయత్నించగా ఫైనల్ గా శివాజి రెండో హౌస్ మెట్ గా నిలిచాడు. రెండు వారాల ఆటలో హౌస్ లో ఇప్పటికే స్ట్రాంగ్ ఎవరు.. వీక్ ఎవరు అన్నది కొంతమేర నిర్ణయించారు. అందరితో పోల్చితే ఒకప్పటి హీరో శివాజి తన ఆట తీరుతో ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. అంతేకాదు తను చేసేదంతా చాలా ఫన్నీగా ఉంటుంది.
ఫస్ట్ వీక్ బిగ్ బాస్ (Bigg Boss) మీద సీరియస్ అయినట్టుగా తన టాలెంట్ చూపించిన శివాజి సెకండ్ వీక్ ఏకంగా పవర్ అస్త్ర సంపాదించాడు. మిగతా వారంతా కూడా టాస్క్ విషయంలో ఎంత హడావిడి చేసినా శివాజి మాత్రం చాలా తెలివిగా మెచ్యుర్డ్ గా ఆడుతూ వస్తున్నాడు. ఇదే అతన్ని ఆడియన్స్ కు దగ్గరయ్యేలా చేస్తుంది. ఇప్పటివరకు జరిగిన ఆట చూస్తే శివాజి టాప్ 5 లో పక్కా ఉంటాడని ఆడియన్స్ అనుకుంటున్నారు. అయితే ఇది బిగ్ బాస్ కదా అదీగాక ఈసారి ఉల్టా పుల్టా అంటున్నారు. మరి అక్కడ ఏదైనా జరగొచ్చు.
శివాజి తో పాటుగా స్టార్ మా బ్యాచ్ కూడా హౌస్ లో స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అమర్ దీప్, సందీప్ ఇప్పటివరకు స్ట్రాంగ్ గా అనిపిస్తున్నారు. అయితే నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయని టాక్. స్టార్ మా సీరియల్ యాక్టర్ అర్జున్ అంబటి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అని తెలుస్తుంది. అతనితో పాటు మరో యాక్ట్రెస్ కూడా వస్తుందని టాక్.
Also Read: Auto Covered into Car : ముందు ఆటో వెనక కారు.. ఇంత టాలెంటెడ్ ఏంటో..!