IPL Effect : థియేటర్స్ అన్ని ఖాళీ
IPL Effect : ఇప్పటికే ఈ సినిమాల ప్రమోషన్లు ఆకట్టుకుంటున్నాయి. ప్రజల్లో పాజిటివ్ వైబ్స్ సృష్టించాయి. విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వస్తే, కనీసం రెండు వారాలపాటు మంచి కలెక్షన్లు రావొచ్చని అభిప్రాయం
- By Sudheer Published Date - 09:12 PM, Sun - 13 April 25

టాలీవుడ్ కు వేసవి సీజన్ (Summer Season) అంటే నిర్మాతలకు, థియేటర్ యాజమాన్యాలకు సువర్ణావకాశం. కానీ ఈ ఏడాది మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మార్చిలో ‘కోర్ట్’, ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి సినిమాలు హిట్ అయినా, ఏప్రిల్‌లో పెద్ద స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో థియేటర్ల ఆక్యుపెన్సీ బాగా పడిపోయింది. ‘జాక్’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలు విడుదలైనా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. యాంకర్ ప్రదీప్ సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’కి ఓపెనింగ్స్ లేకపోవడం, టాక్ కూడా అంతంత మాత్రమేగానే ఉండడం తో థియేటర్స్ లలో సందడి లేకుండాపోయింది. మరోవైపు ఎండలు జనాన్ని బయటకి రావకుండా చేస్తున్నాయి. స్కూళ్లు, ఉద్యోగాలు అన్నీ కలిసి జనాలు అలసిపోయే పరిస్థితి. ఇంకొవైపు ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి డిజిటల్ మాధ్యమాల్లో ఫుల్ బిజీగా ఉన్న ప్రేక్షకులు, టీవీల ముందు కూర్చొని క్రికెట్ (IPL) చూస్తూ థియేటర్స్ ను మరచిపోతున్నారు. దీంతో అనేక థియేటర్స్ ప్రేక్షకులు లేక షోస్ ను రద్దు చేస్తున్నారు.
TTD Chairman BR Naidu: టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర జరుగుతోంది: చైర్మన్ బీఆర్ నాయుడు
ప్రస్తుతం ‘ఓదెల 2’ మరియు ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమాల మీద ఆశలు పెట్టుకున్నారు. ‘హరిహర వీరమల్లు’, ‘ఘాటీ’, ‘కన్నప్ప’ లాంటి పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటంతో, ఈ రెండు సినిమాలే సమ్మర్ రేస్క్యూకు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమాల ప్రమోషన్లు ఆకట్టుకుంటున్నాయి. ప్రజల్లో పాజిటివ్ వైబ్స్ సృష్టించాయి. విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వస్తే, కనీసం రెండు వారాలపాటు మంచి కలెక్షన్లు రావొచ్చని అభిప్రాయం. వేసవి వినోదం కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇవి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారతాయా? లేక ఈ సీజన్‌ను కూడా ఖాళీగానే ముగించేస్తాయా అన్నది చూడాల్సిందే.