Sachin Dakoji: హెయిర్ స్టైలిష్ సంచలనం.. సచిన్ డకోజీ!
కొందరు.. ట్రెండ్ ఫాలో అవ్వడం కంటే.. ట్రెండ్ క్రియేట్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపుతారు. అలాంటివాళ్లలో సచిన్ డకోజీ ఒకరు.
- By Balu J Published Date - 12:45 PM, Mon - 7 February 22

కొందరు.. ట్రెండ్ ఫాలో అవ్వడం కంటే.. ట్రెండ్ క్రియేట్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపుతారు. అలాంటివాళ్లలో సచిన్ డకోజీ ఒకరు. హెయిర్ స్టైలిష్ రంగంలో అడుగు పెట్టి ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు. టెలివిజన్ నటుల మొదలుకొని సినిమా స్టార్స్ వరకు ఎంతోమందికి హెయిర్ స్టైలిష్ గా వ్యవహరిస్తున్నారాయన. తెలుగు రాష్ట్రాలో ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అయిన ఈయన హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో సెలూన్ స్టార్ట్ చేసి.. క్రియేటివ్ హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఈ రంగంలో ఎందుకు అడుగుపెట్టారు? ఆయన లక్ష్యాలు ఏమిటి? అనే విషయాలను ఆయన ప్రత్యేకంగా ‘‘హ్యాష్ ట్యాగ్’’ వెబ్ తో షేర్ చేసుకున్నారు.. ఆ విశేషాలే ఇవి.
మీరు ఈ వృత్తిని ఎంచుకోవడానికి కారణమేమిటి?
చిన్నప్పట్నుంచే నాకు ‘డ్రెస్ అప్’ చేసుకోవడం సరదాగా ఉండేది. ఎలా డ్రస్ అప్ కావాలి? ఏ విధంగా హెయిర్ స్టైల్ మెయింటెన్ చేయాలి? అనే విషయాల గురించే ఆలోచిస్తుండేవాడ్ని. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. నా చిన్నతనంలో కజిన్స్ సిస్టర్స్ కు తరచుగా మెకప్ వేసేవాడ్ని. ఆ తర్వాత హెయిర్ స్టైలిష్ పై ఇష్టం పెరగడంతో లండన్ లో ఆరు నెలల పాటు కాస్మోటాలజీ కోసం ఒక కోర్సులో చేరాను. ఆపై ప్రొఫెషనల్‌గా మారాను.
ఈ రంగంలో ఉన్నందుకు హ్యపీగా ఫీలవుతున్నారా?
సుమారు 27 సంవత్సరాల క్రితం ఈ రంగంలో పనిచేయడం స్టార్ట్ చేశా. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లోనూ ప్రత్యేకంగా సెలూన్స్ నడుపుతున్నా. వీటి ద్వారా ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చాను కూడా. వారు ఇప్పుడు నాతో సమానంగా వర్క్ చేస్తున్నారు. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించానని ప్రౌడ్ గా ఫీలవుతుంటా.
మీకు ఈ రంగంలో చాలా పేరుంది. అయినా ఎందుకు కష్టపడుతున్నారు?
ఏ రంగమైనా సరే.. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకుంటూ ముందుకుసాగాలి. అప్పుడే అనుకున్న రిజల్ట్ వస్తుంది. నేను మొదట హీరో నాగార్జునకు హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేశా. ఆయన వల్ల ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యా. ‘‘నిన్నే పెళ్లాడతా’’ సినిమా నుంచి నా కెరీర్ స్టార్ట్ అయ్యిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత చాలామంది హీరోలు అప్రోచ్ అయ్యారు. ఈ వర్క్ పట్ల నా ప్యాషన్ మరింత పెరుగుతోంది. అందుకే నేను ఆర్ట్ ను ఇతరులకు నేర్పించడం మొదలుపెట్టాను. నా దగ్గర ఉన్న స్కిల్స్ నాతోనే ఉండిపోకూడదు.
మీరు జీవన విధానం గురించి?
ప్రతిఒక్కరి పట్ల ప్రేమగా ఉండండి. ప్రేమ లేకపోతే అందం ఉండదు. మీ పని కూడా అందంగా కనిపించాలంటే మీరు దానిని ప్రేమించి తీరాలి.
మ్యారేజ్ ఈవెంట్స్ కు వెళ్తుంటారా?
ఎస్.. వెళ్తుంటాను. పెళ్లి అనేది మన జీవితంలో మరిచిపోలేని మధురానుభూతి. షూ నుంచి డ్రెస్సింగ్ వరకు మా టీం కేరింగ్ తీసుకుంటుంది. హెయిర్, డ్రెస్సింగ్, లుక్స్.. ఇలా ప్రతిదీ కేర్ గా ఉంటారు. అందుకే చాలామంది మమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు. హైదరాబాద్ లోని ప్రముఖులు, రాజకీయనాయకులు, ఇతర సెలబ్రిటీల మ్యారేజ్ ఈవెంట్స్ కి మేకప్ ఆర్టిస్టుగా పనిచేశాను.
మీ సక్సెస్ కు కారణాలు ఏంటి?
ఈ ప్రపంచం ఎవ్వరు కూడా ఫర్ ఫెక్ట్ కారు.. ప్రతిదీ నాకే తెలుసు అని అనుకోవద్దు కూడా. నా సక్సెస్ కు ప్రధాన కారణంగా ట్రెండ్ ను గమనిస్తుంటాను.. అందుకు తగ్గట్టుగా మౌల్డ్ అవుతుంటాను.. ఇప్పటికే ఎవ్రీ ఇయర్ రెండు షార్ట్ టర్మ్ కోర్సులు చేస్తుంటాను.
మీరు ఇప్పటివరకు చాలామందితో వర్క్ చేశారు కదా.. మీ డ్రీమ్ సెలబ్రిటీ ఎవరు?
మడోన్నా