Business Idea: 18ఏళ్లుగా సరిహద్దులో దేశానికి సేవ…ఇప్పుడు బంతిపూల సాగుతో లక్షల సంపాదిస్తున్న జవాన్..!!
- By hashtagu Published Date - 09:18 PM, Mon - 28 November 22

జంషెడ్ పూర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవఘర్ చెందిన ఎరిక్ ముండా దాదాపు 18ఏళ్లపాటు సరిహద్దుల్లో దేశానికి సేవలందించారు. రిటైర్ అయ్యాక తన స్వంత గ్రామానికి చేరుకున్నాడు. ఖాళీ ఇంట్లో కూర్చుకోకుండా ఏదైనా చేయాలన్న ఆలోచన ఆయనలో కలిగింది. బంతిపూల సాగు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. అన్నట్లుగానే తన పొలంలో బంతిపూల సాగును చేపట్టాడు. తక్కువ ఖర్చు, అధిక రాబడితో మంచి లాభాలను అర్జిస్తున్నారు.
ప్రస్తుతం ఉత్తరభారతంలో గులాబి, పొద్దుతిరుగుడుతోపాటు బంతిపూల సాగు ప్రాచుర్యం పొందుతోంది. ఈ బంతిపూల సాగు చేపట్టిన ఎరిక్ ముండా అందులో వచ్చిన లాభాలతో తన పిల్లలకు మంచి విద్యను అందించాడు. ఇంజనీరింగ్ చదివిన తన పిల్లలు వేరే చోట ఉద్యోగం చేయడం కన్నా…వ్యవసాయం చేసుకోవడం మంచిదని భావించాడు. ఆయన పిల్లలకు వ్యవసాయంలో మెళుకవలు నేర్పించాడు. వారు కూడా ఈ బంతిపూల వ్యాపారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా…తమకు అందుబాటులో ఉన్న వ్యాపారం చేసి కూడా లక్షల సంపాదించవచ్చని ఈ మాజీ సైనికుడు చెబుతున్నారు. ఎంతోమంది రైతులకు, నిరుద్యోగులకు వారు ఆదర్శంగా నిలుస్తున్నారు.
18ఏళ్లుగా దేశానికి సేవలందించిన ఎరిక్ ముండా..నాలుగు ఎకరాల్లో బంతిపువ్వుల సాగు ప్రారంభించాడు. తనకు బాసట తన వారసులు నిలిచారు. ప్రస్తుతం ఈ పూల సాగు ద్వారా మంచి ఆదాయాన్ని అర్జిస్తున్నారు. తన తండ్రి చూసి తాము కూడా ప్రభావితులం అయ్యామని ఎరిక్ కుమారులు చెబుతున్నారు.
వ్యవసాయమే దండగా అనుకుంటున్న ఈ రోజుల్లో ఓ మాజీ సైనికుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చదువు ఉంటే చాలదు…తెలివి ఉంటే ఎక్కడైనా…బతకవచ్చని నిరూపిస్తున్నారు. ఉద్యోగాలు రాలేదని నిరాశ చెందకుండా…ప్రస్తుతం ఎలాంటి వ్యాపారం చేస్తే లక్షల ఆదాయం ఆర్జిస్తామో అలాంటి వ్యాపారాలపై ఫోకస్ పెట్టాలని చెబుతున్నాడు.