Rajinikanth: రాజకీయాలకు దూరమైంది అందుకే.. కారణం చెప్పిన రజనీకాంత్..!
ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ (Rajinikanth) తన రాజకీయ జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. కిడ్నీ సంబంధిత సమస్యల దృష్ట్యా తాను బహిరంగ సభల్లోనూ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందువల్లే రాజకీయాల నుంచి వైదొలిగానని తెలిపారు.
- Author : Gopichand
Date : 12-03-2023 - 9:21 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ (Rajinikanth) తన రాజకీయ జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. కిడ్నీ సంబంధిత సమస్యల దృష్ట్యా తాను బహిరంగ సభల్లోనూ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందువల్లే రాజకీయాల నుంచి వైదొలిగానని తెలిపారు. ఈ విషయాలన్నీ చెబితే తాను భయపడుతున్నానని అనుకుంటారని, అందుకే ఎక్కడా చెప్పలేదని వివరించారు. శనివారం రాత్రి చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి రజనీకాంత్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతున్నప్పుడే రాజకీయ ప్రవేశం చేయాలని అనుకున్నట్లు తెలిపారు.
కానీ బహిరంగ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనరాదని అప్పట్లో వైద్యుడు డాక్టర్ రాజన్ రవిచంద్రన్ సలహా ఇచ్చారని చెప్పారు. ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే జనాలకు కనీసం పది అడుగుల దూరంలో నిలబడి, నిరంతరం మాస్క్ ధరించాలని సూచించారు. కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నప్పుడు కూడా చాలామంది తనకు ఇదే చెప్పారని రజినీ వెల్లడించారు. బహిరంగ సభల్లోనూ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందువల్లే రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఆయన తెలిపారు.
Also Read: Drugs : ఢిల్లీలో అంతర్జాతీయ నార్కోటిక్ డ్రగ్ రాకెట్‌ని ఛేదించిన పోలీసులు.. ముగ్గురు అరెస్ట్
ఈ విషయాలన్నీ చెబితే తాను భయపడిపోతున్నా అనుకుంటారని, అందుకే ఎక్కడా బయటపెట్టలేదని వివరించారు. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ మూవీలో నటిస్తున్నారు. డాక్టర్ మూవీ ఫేమ్ నెల్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జైలర్ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. రజనీకాంత్ తన 170వ చిత్ర ప్రకటన కూడా చేశారు. జ్ఞానవేల్ డైరెక్షన్ లో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావొద్దని తాను చెప్పినట్టు గుర్తుచేశారు. ఆ సమయంలో తనను ఆయన అపార్థం చేసుకున్నారని వివరించారు.