HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >South
  • >Tvk Party Makes Sensational Announcement Officially Announces Vijays Name As Cm Candidate

Actor Vijay: టీవీకే పార్టీ సంచలన ప్రకటన: సీఎం అభ్యర్థిగా విజయ్ పేరును అధికారికంగా ప్రకటించింది

అంతేకాదు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంగ్లీష్ భాషపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన టీవీకే, తమిళనాడులో ద్వంద్వ భాష విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.

  • By Hashtag U Published Date - 11:38 PM, Fri - 4 July 25
  • daily-hunt
Tamilga Vetri Kalagam Party announces Vijay as CM candidate
Tamilga Vetri Kalagam Party announces Vijay as CM candidate

చెన్నై, జులై 4, 2025: Actor Vijay:  తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. తమిళగ వెట్రి కగళం (టీవీకే) పార్టీ తమ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు విజయ్‌ను 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. చెన్నైలో శుక్రవారం జరిగిన టీవీకే ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేస్తూ, బీజేపీ లేదా డీఎంకేలతో ఎలాంటి పొత్తు ఉండదని తేల్చి చెప్పింది. ఈ రెండు జాతీయ పార్టీలు టీవీకే సిద్ధాంతాలకు వ్యతిరేకమని పేర్కొంది. వచ్చే సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య విజయ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తారని పార్టీ వెల్లడించింది. ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లేందుకు గ్రామాల్లో సభలు, బహిరంగ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

అంతేకాదు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంగ్లీష్ భాషపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన టీవీకే, తమిళనాడులో ద్వంద్వ భాష విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. తమిళ ప్రజలపై హిందీ లేదా సంస్కృతాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను అడ్డుకుంటామని విజయ్ తేల్చి చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘం మైనారిటీ ఓట్లను తగ్గించేందుకు ఎన్నికల సవరణలు తీసుకురావడం బాధాకరమని విజయ్ అభిప్రాయపడ్డారు. ఇది బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగేలా చేయాలన్న ప్రయత్నాల్లో భాగమని విమర్శించారు.

2026 ఎన్నికల దృష్ట్యా టీవీకే పార్టీలో జోరుగా మార్పులు, పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విజయ్ వ్యక్తిగతంగా ఈ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Vijay Politics
  • BJP Opposition
  • Tamil Nadu Elections 2026
  • tamil nadu politics
  • TVK Party News
  • TVK Strategies
  • Vijay CM Candidate
  • Vijay TVK

Related News

    Latest News

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd