MK Stalin : బాబు తరహాలో స్టాలిన్ డ్యాష్ బోర్డు
మాజీ సీఎం చంద్రబాబు నాయకుడు అనుసరించిన డ్యాష్ బోర్డు విధానానికి తమిళానాడు సీఎం స్టాలిన్ శ్రీకారం చుట్టాడు. పరిపాలనకు సాంకేతికతను జోడించి పరుగు పెట్టించడానికి స్టాలిన్ పూనుకున్నాడు. అందుకోసం డ్యాష్‌బోర్డ్ మానిటరింగ్ సిస్టమ్‌ను గురువారం తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించింది.
- By CS Rao Published Date - 04:50 PM, Thu - 23 December 21

మాజీ సీఎం చంద్రబాబు నాయకుడు అనుసరించిన డ్యాష్ బోర్డు విధానానికి తమిళానాడు సీఎం స్టాలిన్ శ్రీకారం చుట్టాడు. పరిపాలనకు సాంకేతికతను జోడించి పరుగు పెట్టించడానికి స్టాలిన్ పూనుకున్నాడు. అందుకోసం
డ్యాష్‌బోర్డ్ మానిటరింగ్ సిస్టమ్‌ను గురువారం తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించింది. దాని ద్వారా వర్షపాతం నమూనాలు, రిజర్వాయర్‌లలో నీటి నిల్వలు తదితరాలను పరిశీలిస్తారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పూర్తి సమాచారం డ్యాష్ బోర్డు ద్వారా సీఎం స్టాలిన్ కు అందుతుంది.
రియల్ టైమ్ సమాచారం, సరైన పర్యవేక్షణ, ప్రభుత్వ సామర్థ్యం పెంపుదల, జాప్యాలను తగ్గించడం మరియు సత్వర నిర్ణయాలు తీసుకోవడం ఈ డ్యాష్ బోర్డు ద్వారా సాధ్యం.మొదటి బ్యాచ్‌లో గురువారం విడుదల చేసిన డ్యాష్‌బోర్డ్‌లు రాష్ట్రంలోని అన్ని కీలక రిజర్వాయర్‌లలో నీటి నిల్వ స్థాయిలు మరియు తేదీ నాటికి నీటి లభ్యత స్థితి, వర్షపాతం నమూనాలు, ప్రస్తుత ఉపాధి పోకడలు ఆర్థిక స్థితిని సూచించడానికి మరియు పెద్ద నేరాలకు సంబంధించిన రోజువారీ పోలీసు నివేదికను సూచిస్తాయి.ఇప్పటి వరకు సామాజిక అంశాలపై స్టాలిన్ తీసుకున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా సంచనలం కలిగించాయి. ఇప్పుడు సాంకేతికంగా పరిపాలన పరుగు పెట్టించడానికి చంద్రబాబు మార్గాన్ని అనుసరించిన ఆయన మరో అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు.