5 Skeletons : ఇంట్లో ఐదు అస్తిపంజరాలు.. హత్యలా ? ఆత్మహత్యలా ?
5 Skeletons : 5 అస్తిపంజరాలు.. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా జైలు రోడ్డులో కలకలం రేపాయి. ప్రభుత్వ విశ్రాంత ఇంజినీర్ జగన్నాథ్ రెడ్డి (85) నివాసంలో ఇవి బయటపడ్డాయి.
- By Pasha Published Date - 05:08 PM, Fri - 29 December 23

5 Skeletons : 5 అస్తిపంజరాలు.. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా జైలు రోడ్డులో కలకలం రేపాయి. ప్రభుత్వ విశ్రాంత ఇంజినీర్ జగన్నాథ్ రెడ్డి (85) నివాసంలో ఇవి బయటపడ్డాయి. ఆ అస్తిపంజరాలన్నీ ప్రభుత్వ విశ్రాంత ఇంజినీర్ కుటుంబ సభ్యులవేనని పోలీసులు అంచనా వేస్తున్నారు. అస్తిపంజరాలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇంట్లో జగన్నాథ్ రెడ్డితో పాటు ఆయన భార్య ప్రేమ(80), కుమార్తె త్రివేణి(62), కుమారులు కృష్ణ(60), నరేంద్ర(57) ఉండేవారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వీరంతా ఇతరులకు దూరంగా ఉండేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2019 సంవత్సరం నుంచి కనిపించకుండా పోయిన ఇంజినీర్ జగన్నాథ్ కుటుంబ సభ్యులు.. ఇప్పుడు అస్తిపంజరాల రూపంలో(5 Skeletons) బయటపడటం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join.
జగన్నాథ్ రెడ్డి ఇంట్లో అస్తిపంజరాలు ఉన్నాయని గురువారం స్థానిక మీడియా ప్రతినిధుల ద్వారా పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇంటి లోపలకు వెళ్లిన పోలీసులకు.. ఒక గదిలో మంచాలపై రెండు అస్తిపంజరాలు, నేలపై మరో రెండు అస్తిపంజరాలు నిద్రపోతున్న భంగిమలో కనిపించాయి. ఇంకో రూంలో ఐదో అస్తిపంజరం ఉంది. నిర్మానుష్యంగా ఉన్న ఈ ఇంట్లోకి దొంగలు అనేక సార్లు చొరబడి చోరీలకు కూడా పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.
Also Read: 50 Years – Pension : 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్.. గిరిజనులు, దళితులు, ఆదివాసీలకు వయోపరిమితి తగ్గింపు
మృతుల వయసు, ఇతర వివరాలను తెలుసుకునేందుకు అస్తిపంజరాల నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పోలీసులు పంపించారు. ఆ ఇంట్లో ప్రస్తుతం ఎవరు ఉంటున్నారు ? ఇంతమంది మరణాలు జరుగుతున్నా విషయం ఎందుకు బయటికి రాలేదు ? అనే సమాచారం సేకరిస్తున్నారు. ఇరుగుపొరుగు వారిని కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. అసలు ఇవి ఆత్మహత్యలా ? హత్యలా ? అనే దానిపై పెద్ద సస్పెన్స్ నెలకొంది. దర్యాప్తు, ఫోరెన్సిక్ పరీక్షల తర్వాతే మొత్తం వివరాలు తెలిసే అవకాశం ఉంది.