Condoms in School Bags: షాకింగ్.. విద్యార్థుల స్కూల్ బ్యాగుల్లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు!
నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన విద్యార్థులు దారి తప్పి ప్రవర్తిస్తున్నారు.
- By Balu J Updated On - 05:34 PM, Thu - 1 December 22

నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన విద్యార్థులు దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. టీనేజ్ వయసులోనే కాలేజీ కుర్రాళ్లతో పోటీ పడతూ చేయకూడని పనులు చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. బెంగళూరులోని ప్రైవేట్ పాఠశాలల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. విద్యార్థులు సెల్ ఫోన్స్ వాడుతున్నారని పాఠశాల యజమాన్యానికి కంప్లైంట్స్ అందడంతో బ్యాగులను తనిఖీ చేయడంతో దిమ్మదిరిగే విషయాలు బయటకొచ్చాయి. బెంగళూరులోని పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగ్‌ల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు కనిపించడంతో టీచర్లు షాక్ అయ్యారు.
బెంగళూరులోని కొన్ని పాఠశాలల యాజమాన్యం పిల్లల బ్యాగుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు లాంటివి దొరకడం చర్చనీయాంశమవుతోంది. 8, 9, 10 తరగతుల విద్యార్థుల స్కూల్ బ్యాగుల్లో కండోమ్స్ తో పాటు డబ్బులు, సెల్ ఫోన్లు కూడా కనిపించాయి. ఈ సంఘటన తర్వాత ‘‘అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ స్కూల్స్ ఇన్ కర్ణాటక’’ (KAMS) బెంగళూరు పాఠశాలలను పిల్లల స్కూల్ బ్యాగ్‌లను క్రమం తప్పకుండా చెక్ చేయాలని నిర్ణయించింది.
అయితే సమస్యను పరిష్కరించడానికి పాఠశాలలు తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశాలను కూడా నిర్వహించినట్లు నివేదిక పేర్కొంది. “ఇలాంటి సంఘటనల పట్ల మాకే కాదు.. తల్లిదండ్రులు కూడా షాక్ అవుతున్నారు. వారు కూడా తమ పిల్లల ప్రవర్తనలో మార్పును గమనిస్తున్నారు ”అని ప్రిన్సిపాల్ చెప్పారు. అయితే విద్యార్థులను సస్పెండ్ చేయకూడదని పాఠశాలలు నిర్ణయించాయి. బదులుగా వారి ప్రవర్తనలో మార్పును తీసుకురావాలని, కౌన్సెలింగ్ సెషన్‌లకు పంపాలని నిర్ణయించాయి. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

Related News

Jr NTR and Kalyan Ram: తారకరత్నను పరామర్శించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. తారకరత్న హెల్త్‌పై ఎన్టీఆర్ ఏమన్నారంటే..?
బెంగుళూరులోని నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న(Taraka Ratna)ను సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఆదవారం పరామర్శించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగుళూరుకు చేరుకున్నారు.