HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Shock To Aiadmk Three Mlas Resign

AIADMK: అన్నాడీఎంకేకు షాక్‌..ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

  • Author : Vamsi Chowdary Korata Date : 25-05-2026 - 4:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shock to AIADMK: Three MLAs Resign
Shock to AIADMK: Three MLAs Resign

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగంలో (టీవీకే) చేరారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమార్వేల్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్ తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు అందజేశారు. అనంతరం మంత్రి ఆధవ్ అర్జునను కలిసి వారు టీవీకేలో చేరారు. ఈ ముగ్గురు నేతలు అన్నాడీఎంకేలోని మాజీ మంత్రులు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి వర్గానికి సన్నిహితులుగా పేరుపొందారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేసిన టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మెజారిటీకి కొన్ని స్థానాలు తగ్గడంతో కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొదట్లో వేలుమణి వర్గానికి చెందిన 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, వారికి మంత్రివర్గంలో స్థానం లభించలేదు.

తాజా పరిణామంతో అన్నాడీఎంకేలో మరిన్ని వికెట్లు పడతాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే సీఎం విజయ్ తిరుచ్చి తూర్పు స్థానానికి రాజీనామా చేయగా, ఇప్పుడు ఈ ముగ్గురి రాజీనామాలతో రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో త్వరలో జరగబోయే ఉపఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIADMK
  • mlas resign
  • tamil nadu politics
  • TVK Party
  • Vijay thalapathy

Related News

10-Year-Old Girl Kidnapped and Murdered in Coimbatore... CM Vijay Shares Emotional Post!

Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఘోరం జరిగింది. సూలూరు ఏరియాలో కిరాణా సామాన్లు తేవడానికి వెళ్లిన పదేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. ఆపై ఆ చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం చెరువు సమీపంలో మృతదేహం దొరికింది. ఈ ఘటనపై తమిళనాడు కొత్త సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అమానవీయ చర్యలను అస్సలు సహించబోమని స్పష్టం చేశారు. కఠిన శిక్షపడేలా చేస్తాం: విజయ్‌ ‘‘ఈ ఘ

  • Vijayasai Reddy's Sensational Tweet on Tamil Nadu Politics

    Vijaya Sai Reddy: తమిళనాడు రాజకీయాలపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

Latest News

  • AIADMK: అన్నాడీఎంకేకు షాక్‌..ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

  • Metro Rail: హైదరాబాద్‌ మెట్రోకు భారీ ఊరట

  • Nirmala Sitharaman: ఆర్థిక సవాళ్లపై నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు

  • Kumkuma Bottu: స్త్రీలు కుంకుమ ఎందుకు ధరించాలి? పురాణాలు ఏం చెబుతున్నాయి?

  • Sleeping With Phone: ఫోన్‌ను దిండు కింద పెట్టి పడుకుంటున్నారా..?

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd