HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Shivamogga Lok Sabha Battle Children Of Former Cms Get Set For A Race To Parliament

Former CMs Children : ఆ స్థానం నుంచి మాజీ సీఎంల ఫ్యామిలీలు ఢీ.. పోటీ రసవత్తరం

Former CMs Children : ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుటుంబాలు ఈసారి ఆ లోక్‌సభ స్థానం నుంచి హోరాహోరీగా తలపడనున్నాయి.

  • By Pasha Published Date - 02:33 PM, Tue - 12 March 24
  • daily-hunt
Former Cms Children1
Former Cms Children1

Former CMs Children : ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుటుంబాలు ఈసారి ఆ లోక్‌సభ స్థానం నుంచి హోరాహోరీగా తలపడనున్నాయి. అందుకే యావత్ దేశం దృష్టి దానిపై ఉంది. ఇంతటి ఉత్కంఠకు, రసవత్తర పోరుకు నెలవుగా మారిన ఆ లోక్‌సభ స్థానమే కర్ణాటకలోని శివమొగ్గ.  ఇంతకీ ఆ స్థానం నుంచి ఎవరెవరు పోటీపడబోతున్నారు .. ఎవరెవరి బలాబలాలు ఎంతెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • ఎస్. బంగారప్ప కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన 1990 సంవత్సరం నుంచి 1992 వరకు కర్ణాటక సీఎంగా వ్యవహరించారు.
  • బంగారప్ప  44 ఏళ్ల రాజకీయ జీవితంలో 1996 నుంచి 2009 వరకు వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
  • దివంగత సీఎం ఎస్.బంగారప్ప కుమార్తె గీతా శివరాజ్‌ కుమార్‌కు కాంగ్రెస్ ఈసారి శివమొగ్గ లోక్‌సభ టికెట్ ఇచ్చింది. ఇటీవలే కాంగ్రెస్ విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల తొలిజాబితాలో గీత పేరు ఉంది.
  • గీతా శివరాజ్‌ కుమార్‌కు పోటీగా మరో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్‌ యడ్యూరప్ప కుమారుడు,  శివమొగ్గ సిట్టింగ్‌ ఎంపీ బీవై రాఘవేంద్ర బరిలోకి దిగుతారని తెలుస్తోంది.
  • 2009లోనే బీవై రాఘవేంద్ర(Former CMs Children) తొలిసారిగా బీజేపీ నుంచి దివంగత మాజీ సీఎం ఎస్ బంగారప్పపై పోటీ చేసి గెలిచారు.
  • 2014లో యడ్యూరప్పపై గీతా శివరాజ్‌కుమార్‌ పోటీ చేసి ఓడిపోయారు.
  • 2018 లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా మధు బంగారప్ప జేడీఎస్ గుర్తుపై పోటీ చేయగా.. బీవై రాఘవేంద్ర చేతిలో ఓడిపోయారు.
  • 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీవై రాఘవేంద్రపై జేడీఎస్ తరఫున పోటీ చేసిన మధు బంగారప్ప మరోసారి ఓటమిని మూటకట్టుకున్నారు.
  • ఇలా గడిచిన నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో యడ్యూరప్ప, బంగారప్ప కుటుంబీకులు శివమొగ్గ నుంచి నేరుగా తలపడ్డారు. ఇప్పుడు ఐదోసారి పోటీ పడనున్నారు.

Also Read : Fake Passport Scam : నకిలీ పాస్​పోర్ట్​ స్కామ్​లో మరో ముగ్గురు పోలీసుల అరెస్ట్.. ఏమిటీ కుంభకోణం ?

  • కన్నడ నటుడు శివరాజ్ కుమార్​ను పెళ్లి చేసుకున్న తర్వాత గీత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ః
  • 2014 సంవత్సరంలోనే రాజకీయాల్లోకి గీత రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం గీత సోదరుడు శివమొగ్గ జిల్లాకు ఇంఛార్జ్ మంత్రిగా ఉన్నారు.
  • గత ఎన్నికల్లో గీతా శివరాజ్‌కుమార్‌ తరఫున ప్రముఖ నటులు ఉపేంద్ర, విజయ రాఘవేంద్ర, శ్రీమురళి, వినోద్‌ ప్రభాకర్‌ ప్రచారానికి వచ్చారు.
  • గీత భర్త, కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ కూడా ప్రచారం చేయనున్నారు.
  • లోక్‌సభ అభ్యర్థిగా తనను ప్రకటించడంతో గీత .. బెంగళూరులోని తన సోదరుడు మధు బంగారప్ప ఇంటి పక్కనున్న ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు.

Also Read :Gutta Sukhender Reddy : నేడో, రేపో కాంగ్రెస్‌లోకి గుత్తా సుఖేందర్‌ రెడ్డి కుమారుడు ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Former CMs Children
  • Race To Parliament
  • Shivamogga Lok Sabha

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd