Chennai Rains: తమిళనాడులో రెడ్ అలెర్ట్
తమిళనాడు, పాండిచేరి రెడ్ అలెర్ట్ ను ప్రకటించాయి. నవంబర్ 11, 12 తేదీల్లో సెలవును ప్రకటిచారు. ఇప్పటి వరకు 12 మంది భారీ వర్షాలకు మరణించారు.
- Author : CS Rao
Date : 10-11-2021 - 3:53 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడు, పాండిచేరి రెడ్ అలెర్ట్ ను ప్రకటించాయి. నవంబర్ 11, 12 తేదీల్లో సెలవును ప్రకటిచారు. ఇప్పటి వరకు 12 మంది భారీ వర్షాలకు మరణించారు. చెన్నై లో NDRF దళాలు రంగంలోకి దిగాయి. మునుపెన్నడూ లేనివిధంగా భారీ వర్షం తమిళనాడులో కురిసింది.తమిళనాడు ప్రభుత్వం చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పేట్, కడలూరు, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్ మరియు మైలాడుతురై — తొమ్మిది జిల్లాల్లో పాఠశాలలు మరియు కళాశాలలకు నవంబర్ 10 మరియు 11 తేదీలలో సెలవు ప్రకటించింది.రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 12కి చేరుకుందని తమిళనాడు రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కెకెఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ తెలిపారు.
Also Read : విప్లవం నీడన `గోండుల` వ్యధ
చెన్నైలోని ఐదు బృందాలతో సహా 13 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు తమిళనాడు మరియు పుదుచ్చేరిలో రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్ల కోసం మోహరించబడ్డాయి. అదనంగా మరో మూడు జట్లను రిజర్వ్ పొజిషన్‌లో ఉంచారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం త్వరలో తుఫాన్ గా మారే అవకాశం ఉందని, మరో రెండు రోజుల పాటు తమిళనాడు అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెన్నైలో తెలిపింది. చెన్నై, కాంచీపురంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, కడలూర్, విల్లుపురం, చెంగల్పట్టు, కళ్లకురుచ్చి, మైలాడుతురై, నాగపట్నం, తనియావూరు, తిరువారూర్, పుదుకోట్టై, శివగంగై, రామనాథపురం, సేలం, తిరుచిరాపల్లి, అరియలూర్, పెరంబలూర్, మధురై, తిరువళ్లూరు జిల్లాల యంత్రాంగం అలెర్ట్ అయింది.
Also Read : పశ్చిమ కనుమలను కాపాడుతున్న వీరవనితలు