HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Rape Accused Lingayat Seer Detained By Police In Karnataka

Karnataka: క‌ర్ణాట‌క లో మరో `డేరాబాబా`అరెస్ట్

మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన అభియోగంపై ప్రముఖ లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావును సోమవారం

  • Author : CS Rao Date : 29-08-2022 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Derababa Karnataka
Derababa Karnataka

మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన అభియోగంపై ప్రముఖ లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావును సోమవారం క‌ర్ణాట‌క పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటక చిత్రదుర్గలోని ప్రముఖ మురుగ మఠానికి ఆయ‌న ప్రధాన పీఠాధిపతి. ఆయ‌న్ను హవేరి జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. మఠం నిర్వహిస్తున్న సంస్థలో ని విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు మైనర్ల తరపున ఫిర్యాదు చేయడంతో మైసూరు నగర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అతనిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మఠం ఆధీనంలో పాఠ‌శాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు మైసూరులోని NGO ‘ఓడనాడి సేవా సంస్థ’ను సంప్రదించారు. ఆ ఎన్జీవో వాళ్ల స‌మ‌స్య‌ను జిల్లా బాలల సంక్షేమ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సంస్థ వార్డెన్‌తో సహా మరో నలుగురిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. మురుగ మఠం పరిధిలోని హాస్టల్‌లో ఉంటున్న 15, 16 ఏళ్ల బాలికలు మూడున్నరేళ్లుగా లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇది చాలా ఏళ్లుగా జరుగుతోంది. కానీ భయంతో విషయాన్ని పిల్ల‌లు బయటపెట్టలేదని ఆ సంస్థ గుర్తించింది. బాలల హక్కులను పరిరక్షించడం కోసం పోరాటం చేయ‌డంతో మొత్తం వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కర్నాటక ప్రభుత్వం ఏం చెప్పింది?
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ, పోలీసులు ఈ ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారని, దర్యాప్తు పూర్తయిన తర్వాత నిజం బయటపడుతుందని అన్నారు. చిత్రదుర్గ పోలీసులు పోక్సో, కిడ్నాప్ కేసు నమోదైంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణ జరుగుతున్నప్పుడు దానిపై చర్చించడం సరికాదు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెల్లడిస్తారని సీఎం అన్నారు.

బీజేపీకి చెందిన కేఎస్ ఈశ్వరప్ప ఆరోపణలపై తాను బాధపడ్డానని, ఆ వార్తలు అవాస్తం కావాల‌ని ప్రార్థిస్తున్నానని అన్నారు.‘‘చిత్రదుర్గ మురుగ మఠం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. నేను వార్తతో బాధపడ్డాను. వార్తలు అసహ్యంగా ఉన్నాయి. ఆ వార్త అబద్ధమని ప్రార్థిస్తాను. సమస్యపై విచారణ జరుగుతోంది. విచారణ పూర్తయిన తర్వాత ఏదైనా చెప్పొచ్చు. దీనికి ముందు ఊహించడం సాధ్యం కాదు. విచారణలో ఏది వచ్చినా మేము అంగీకరించాలి. ” అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotees
  • karnataka
  • rape case

Related News

400 Cr Cash Goes Missing

రూ.400 కోట్లతో వెళ్తున్న కంటెయినర్లను కొట్టేసిన దొంగలు ! అసలు ఎలా సాధ్యం ?

తరలిస్తున్న నగదు రద్దు చేయబడిన పాత రూ. 2,000 నోట్లని పోలీసులు అనుమానిస్తుండటం. ఒకవేళ అది నిజమైతే, చెల్లుబాటులో లేని అంత భారీ సొమ్మును ఎక్కడికి, ఎవరి కోసం తరలిస్తున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

    Latest News

    • Medaram : మేడారంలో చేతులెత్తేసిన ఆర్టీసీ, మంత్రి పొన్నం పై భక్తుల ఆగ్రహం

    • రాయడానికి వీలులేని విధంగా చంద్రబాబు పై అంబటి బూతులు ల**దగ్గరి నుండి దిగలేదు

    • బిల్ గేట్స్‌కు ఆ వ్యాధి సోకిందా? వారితో శృంగారమే కారణమా ?

    • ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

    • అమెరికా ప్రభుత్వం మళ్లీ షట్ డౌన్..!

    Trending News

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd