HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Rain Terror In Many States Heavy Rains For 2 More Days

Rains : పలు రాష్ట్రాల్లో వర్ష భీభత్సం…మరో 2 రోజులు ఇంతే..!!

దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నదులు ఉదృతంగా ప్రవహించి నివాసప్రాంతాలను ముంచెత్తున్నాయి.

  • Author : hashtagu Date : 30-08-2022 - 6:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rains
Rains

దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నదులు ఉదృతంగా ప్రవహించి నివాసప్రాంతాలను ముంచెత్తున్నాయి. ఈ వరదల్లో ఆరుగురు మృతి చెందారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉత్తరాఖండ్ నుంచి కేరళ వరకూ నదుల్లో నీటి మట్టం పెరుగుతోంది. అది ప్రమాదకర స్థాయికి చేరి నివాస ప్రాంతాలను ముంచెత్తుతోంది.

ఉత్తరప్రదేశ్ లో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరణాసి, ఘాజీపూర్, మీర్జాపూర్, బలియా నగరాల్లో లోతట్టుప్రాంతాలు నీట మునిగాయి. గంగాతీర ప్రాంతాల్లోని 80 గ్రామాలు జలదగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల కారణంగా ముగ్గురు మరణించారు. ప్రయాగరాజ్ నగరంలోని గంగా నదీ తీర ప్రాంతంలోని ఇళ్లు వరదనీటిలో నానుతున్నాయి.

కేరళలోని పలు జిల్లాలో అతి భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కుడియాత్తూర్ లో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. సమాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. కర్నాటకలో భారీవర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మైసూరు, మండ్య, చామరాజనగర, రామనగర, దక్షిణ కన్నడ జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలకు మైసూరు, బెంగళూరు మధ్య రహదారిపై నీరు చేరింది. రామనగరలో అనేక కార్లు, వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దేశంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వరదలతో ప్రభావితమైన రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • karnataka
  • kerela
  • rains
  • up
  • Weather Update

Related News

IMD Alert

Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐఎమ్‌డీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ శనివారం వరకు అమల్లో ఉండనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసర

  • Tamil Nadu Assembly passes unanimous resolution against Karnataka government's proposal.

    Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd