Namaz Protest: పాఠశాలలో విద్యార్థుల నమాజ్.. నిరసన వ్యక్తం చేసిన హిందూ సంఘాలు
కర్ణాటకలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం విద్యార్థులు ప్రతి శుక్రవారం నమాజ్ చూసుకుంటున్నారు. నమాజ్ చేసుకోవడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనుమతి ఇచ్చారని హిందూ సంఘాలు ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశాయి.
- By Hashtag U Published Date - 06:00 AM, Mon - 24 January 22
 
                        కర్ణాటకలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం విద్యార్థులు ప్రతి శుక్రవారం నమాజ్ చూసుకుంటున్నారు. నమాజ్ చేసుకోవడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనుమతి ఇచ్చారని హిందూ సంఘాలు ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో కోలార్ జిల్లా కలెక్టర్ ఉమేష్ కుమార్ ముల్బాగల్ సోమేశ్వర పాలయ బాలే చంగప్ప ప్రభుత్వ కన్నడ మోడల్ హయ్యర్ ప్రైమరీ స్కూల్ పనితీరుపై విచారణకు ఆదేశించారు.
ప్రభుత్వ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ రేవణ సిద్దప్పకు పాఠశాలను సందర్శించి విచారణ జరిపి నివేదిక సమర్పించే బాధ్యతను అప్పగించారు. అయితే నిరసనకారులు దీని గురించి ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని ప్రశ్నించగా తనకు దీని గురించి ఏమీ తెలియదని తాను ఎవరికి అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.
 
                    



