Karnataka: మాజీ సీఎం కుమార స్వామి పై విద్యుత్ చౌర్యం కేసు
- By Balu J Published Date - 03:05 PM, Wed - 15 November 23

Karnataka: కర్ణాటకలో కరెంటు కోతలపై ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమార స్వామిపై విద్యుత్ చౌర్యం కేసును నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీపావళి పండుగ సందర్భంగా బెంగుళూరులోని తన నివాసానికి విద్యుత్ దీపాలను అలంకరించేందుకు ఓ కరెంట్ స్తంభం నుంచి విద్యుత్‌ను అక్రమంగా తీసుకున్నారంటూ బెంగుళూరు విద్యుత్ సరఫరా సంస్థ కేసు నమోదు చేసింది.
విద్యుత్తు స్తంభం నుంచి అక్రమంగా కరెంట్ వినియోగించిన వ్యవహారంపై మంగళవారం బెస్కాం ఏఈఈ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో జయనగర పోలీసులు కుమారస్వామిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదుపై మాజీ సీఎం కుమారస్వామి స్పందిస్తూ తన నివాసాన్ని అలంకరించే బాధ్యతను ఓ ప్రైవేటు డెకొరేటర్‌కు అప్పగించగా, కేవలం టెస్టింగ్ కోసమే బయట నుంచి విద్యుత్తు తీసుకున్నారని వివరణ ఇచ్చారు. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Related News

BRS MLA: బీఆర్ ఎస్ ఎమ్మెల్యేపై పబ్లిక్ న్యూసెన్స్ కేసు
BRS MLA: బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పద్మారావుపై పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదైంది. సోమవారం ఔదయ్యనగర్‌లో ప్రజలకు ఇబ్బంది కలిగించి, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు BRS ఎమ్మెల్యే అభ్యర్థి అయినా టి. పద్మారావు గౌడ్‌పై మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న పద్మారావు గౌడ్ నివాసం దగ్గర అబ్దుల్ షఫీ నేతృత్వంలోని పెద్ద ఎత్తున గుమ�