IIT Madras: మరోసారి టాప్‌లో ఐఐటీ మద్రాస్!
దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా ఐఐటీ మద్రాస్ నిలిచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమింగ్(NIRF) జాబితాను విడుదల చేశారు.
- By Gopichand Published Date - 05:53 PM, Mon - 12 August 24

IIT Madras: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాల భారత ర్యాంకింగ్‌ను విడుదల చేశారు. మీరు NIRF ర్యాంకింగ్‌ను అధికారిక వెబ్‌సైట్ nirfindia.orgలో తనిఖీ చేయవచ్చు. గతసారి మాదిరిగానే ఈసారి కూడా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలు, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, మెడిసిన్, డెంటిస్ట్రీ, లా, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, వ్యవసాయం అనుబంధాలను కలిగి ఉన్న 13 విభిన్న కేటగిరీలలో NIRF ర్యాంకింగ్ జాబితా విడుదల చేసింది. 13 కేటగిరీలు కాకుండా ఈసారి ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లు మూడు కొత్త విభాగాలలో కూడా విడుదల చేశారు. ఓపెన్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, స్టేట్ ఫండెడ్ గవర్నమెంట్ యూనివర్సిటీ విభాగాలలో కూడా విడుదల చేశారు.
దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా ఐఐటీ మద్రాస్ (IIT Madras) నిలిచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమింగ్(NIRF) జాబితాను విడుదల చేశారు. మేనేజ్మెంట్ కేటగిరీలో IIM అహ్మదాబాద్, ఇంజినీరింగ్‌లో IIT మద్రాస్, ఫార్మసీలో జమియా హమ్దార్ద్ తొలి స్థానంలో నిలిచాయి. ప్రస్తుతం ఉన్న 13 కేటగిరీలకు అదనంగా మరో మూడింటిని చేర్చి కేంద్రం ఈ ర్యాంకుల్ని ప్రకటించింది.
Also Read: Kejriwal : ఎల్జికి కేజ్రీవాల్ లేఖ..నిబంధనలు ఉల్లంఘించడమే: జైలు అధికారులు
NIRF- మొత్తం ర్యాంకింగ్‌లో టాప్ 5 సంస్థల పేర్లు
-ఐఐటీ మద్రాస్
-IISc బెంగళూరు
-ఐఐటీ బాంబే
-ఐఐటీ ఢిల్లీ
-ఐఐటీ కాన్పూర్
NIRF ర్యాంకింగ్‌లో టాప్ 5 విశ్వవిద్యాలయాలు
-ఐఐఎస్సీ, బెంగళూరు
-జేఎన్‌యూ, న్యూఢిల్లీ
-జేఎంఐ, న్యూఢిల్లీ
-మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్
-బీహెచ్‌యూ, వారణాసి
NIRF ర్యాంకింగ్‌లో టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీలు
-ఐఐటీ మద్రాస్
-ఐఐటీ ఢిల్లీ
-ఐఐటీ బాంబే
-ఐఐటీ కాన్పూర్
-ఐఐటీ ఖరగ్‌పూర్
NIRF ర్యాంకింగ్‌లో టాప్ 5 కాలేజీల జాబితా
– హిందూ కళాశాల, ఢిల్లీ
– మిరాండా కాలేజ్, ఢిల్లీ
– సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, ఢిల్లీ
– రామ్ కృష్ణ మిషన్ వివేకానంద శతాబ్ది కళాశాల, కోల్‌కతా
-ఆత్మ రామ్ సనాతన్ ధర్మ కళాశాల, ఢిల్లీ
We’re now on WhatsApp. Click to Join.