NEET 2023 Topper: నీట్ టాప్ ర్యాంకర్ ప్రభంజన్ సక్సెస్ మంత్రం ఇదే..!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ యూజీ 2023 మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. నీట్ యూజీ 2023 ఫలితాలను ఏజెన్సీ మంగళవారం ప్రకటించింది.
- By Gopichand Published Date - 10:04 AM, Wed - 14 June 23

NEET 2023 Topper: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ యూజీ 2023 మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. నీట్ యూజీ 2023 ఫలితాలను ఏజెన్సీ మంగళవారం ప్రకటించింది. దీనితో పాటుగా NTA అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో నీట్ యూజీ 2023 ఫలితాలను తనిఖీ చేయడానికి లింక్‌ను యాక్టివేట్ చేసింది. కాబట్టి ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లోని యాక్టివ్ లింక్ నుండి తమ ఫలితాన్ని తనిఖీ చేయవచ్చు. మరోవైపు NTA విడుదల ప్రకారం.. నీట్ యూజీ 2023 టాపర్ జాబితాలో తమిళనాడుకు చెందిన ప్రభంజన్. జే, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన బోరా వరుణ్ చక్రవర్తి సంయుక్తంగా మొదటి స్థానం (AIR 1) పొందారు.
నిరంతర అభ్యాసం
తమిళనాడులోని విల్లుపురంలో నివసిస్తున్న ప్రభంజన్ తన గెలుపు క్రెడిట్‌ను తల్లిదండ్రులకు అందించాడు. అందిన సమాచారం ప్రకారం.. ప్రభంజన్ తల్లి, తండ్రి ఇద్దరూ ఉపాధ్యాయులే. ఈసారి 20 లక్షల మందికి పైగా అభ్యర్థులతో నీట్ యూజీ ప్రవేశ పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచిన ప్రభంజన్ తన విజయ మంత్రాన్ని పంచుకుంటూ నీట్ ప్యాటర్న్ ఆధారిత ప్రశ్నలను నిరంతరం సాధన చేయడం వల్లే తాను ఇలా రాణించగలిగానని చెప్పాడు. అతని తల్లిదండ్రులతో పాటు ప్రభంజన్ తన విజయానికి తన పాఠశాల యాజమాన్యం కూడా ఎంతో హెల్ప్ చేసిందని తెలిపాడు. నీట్ యూజీ 2023లో 720 మార్కులకు అంటే 99.9999019 పర్సంటైజ్ సాధించిన ప్రభంజన్ జనరల్ కేటగిరీ నుండి పరీక్షకు హాజరయ్యారు. ప్రభంజన్ కూడా తన 12వ తరగతి పరీక్షల్లో 500కి 463 (93.2 శాతం) సాధించాడు.
Also Read: NEET Result 2023 : నీట్ లో తెలుగోళ్ల తడాఖా.. ఏపీ స్టూడెంట్ కు టాప్ ర్యాంక్
పరీక్ష కోసం నమోదు చేసుకున్న 20,87,462 మంది అభ్యర్థుల కోసం NTA మే 7, 2023న NEET UG 2023ని నిర్వహించింది. దేశ, విదేశాల్లోని మొత్తం 499 నగరాల్లో ఏర్పాటు చేసిన 4097 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. దీని తర్వాత జూన్ 11న ఎన్టీఏ ఆన్సర్ కీని విడుదల చేసి జూన్ 12 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించింది. ఈ అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత జూన్ 13 సాయంత్రం ఫలితాలను ప్రకటించారు.