Viral Video : అమ్మ ప్రేమకు మించింది ఏదీ లేదు..తన పిల్లల క్షేమం కోసం ఎలుగుబంటి తపనపై నెటిజన్లు ఫిదా..!!
ఈ దునియాలో అమ్మప్రేమకు మించిది ఏదీ లేదు. అమ్మ తన పిల్లల క్షేమం అనుక్షణం తపనపడుతుంది. తన సుఖసంతోషాలను కూడా వదులుకుంటుంది.
- By hashtagu Published Date - 01:46 PM, Mon - 11 July 22

ఈ దునియాలో అమ్మప్రేమకు మించిది ఏదీ లేదు. అమ్మ తన పిల్లల క్షేమం అనుక్షణం తపనపడుతుంది. తన సుఖసంతోషాలను కూడా వదులుకుంటుంది. అమ్మప్రేమకు మూగజీవాలుకూడా అతీతం కాదు. తమ పిల్లల కోసం..వాటిని కాపాడకోవడం కోసం తమ ప్రాణాలను కూడా అడ్డేస్తాయి. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాం…చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఎలుగుబంటి తన పిల్లలను క్షేమంగా రోడ్డు దాటించడానికి పడుతున్న తపన నెట్టింట్లో వైరల్ గా మారింది. రద్దీగా ఉన్న రోడ్డుమీద నుంచి పిల్లలను జాగ్రత్తగా తీసుకెళ్లాడానికి ఎలుగుబంటి చూపిన ప్రేమ అక్కడున్న వాహనదారులను కట్టిపడేసింది.
తల్లిప్రేమ ఎవరిదైనా ఒకటి కదా అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఆ ఎలుగుబంటి తన పిల్లలను రోడ్డు దాటించే వరకు వాహనదారులు ఓపికపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
https://twitter.com/gunsnrosesgirl3/status/1546248268618817537?s=20&t=rhKr43d4fwu1QftasP8jXw