పెట్టుబడుల స్వర్గధామం తెలంగాణ.. జహీరాబాద్ లో మహీంద్ర కే2 ట్రాక్టర్ల కంపెనీ
పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారు. ఆ విషయాన్ని మహీంద్ర కంపెనీ ఎండీ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ప్రపంచంలో పెట్టుబడులకు తెలంగాణ మంచి కేంద్రమని ట్వీట్ చేశారు
- By Hashtag U Published Date - 03:04 PM, Thu - 30 September 21

పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారు. ఆ విషయాన్ని మహీంద్ర కంపెనీ ఎండీ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ప్రపంచంలో పెట్టుబడులకు తెలంగాణ మంచి కేంద్రమని ట్వీట్ చేశారు. అంతేకాదు, ప్రపంచానికి ట్రాక్టర్లను అందిచడానికి కొత్త టెక్నాలజీతో కూడిన కే2 ట్రాక్టర్స్ తయారీ పరిశ్రమని నెలకొల్పుతున్నట్టు వెల్లడించారు. హైద్రాబాద్ సమీపంలోని జహీరాబాద్ వద్ద కే2 ట్రాక్టర్ల తయారీ పరిశ్రమను పెడుతున్నట్టు ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.
The ambitious K2 project is something we are looking forward to as well Mr. Sikka
Thanks for your expansion in #Telangana & continued support @anandmahindra Ji https://t.co/sPkqvx8mTT
— KTR (@KTRTRS) September 29, 2021
ఇటీవల మహీంద్ర కంపెనీ లిమిడెట్ ప్రెసిడెంట్ సిక్కా జహీరాబాద్ పర్యటన గురించి ట్వీట్ చేశాడు. వెంటనే ఆనంద్ మహీంద్ర మరో ట్వీట్ చేశాడు. తెలంగాణ..ల్యాండ్ ఆఫ్ కేటీఆర్ అంటూ ఆయన ట్వీట్లో సంబోధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ట్రాక్టర్లను ఎగుమతి చేయడానికి మహీంద్ర కంపెనీ కే2 టెక్నాలజీని ఉపయోగించి తక్కువ బరువుతో ఎక్కువ సేద్యం చేసే సామర్థ్యం ఉన్న ట్రాక్టర్ల వైపు దృష్టి పెట్టింది. ఆ ప్లాంట్ ను జహీరాబాద్ వద్ద పెడుతోంది. ఆనంద్ చేసిన ట్వీట్ కు తిరిగి కేటీఆర్ ట్వీట్ చేస్తూ ధన్యవాదాలు చెప్పారు.
జహీరాబాద్ ప్లాంట్ నుంచి 37 రకాల ట్రాక్టర్లను తయారు చేయాలని మహీంద్ర లక్ష్యంగా పెట్టుకుంది. మహీంద్ర, మితుబుషి, జపాన్ కంపెనీలు సంయుక్తంగా రూపొందించిన టెక్కాలజీని ఉపయోగిస్తారు. ఆసియా, జపాన్, అమెరికా దేశాలకు ఎగుమతులు చేయాలని మహీంద్ర కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Related News

Scorpio Without Airbags: ఎయిర్బ్యాగ్స్ వివాదంపై మహేంద్ర క్లారిటీ
మహీంద్రా కార్లకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. సంస్థ అధినేత ఆనంద్ మహేంద్ర నిత్యం సోషల్ మీడియాలో ఎదో ఒక సమస్యపై స్పందిస్తూనే ఉంటాడు. గతేడాది జరిగిన కారు ప్రమాదం కారణంగా మహేంద్ర ఆనంద్ పై కేసు నమోదైంది.