HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Kerala Neet Innerwear Row Girls Allowed To Re Appear For Exam

Kerala NEET inner wear row:ఎన్‌టీఏ కీల‌క నిర్ణ‌యం.. ఆ అమ్మాయిల‌కు మ‌ళ్లీ ప‌రీక్ష‌

జాతీయ ప‌రీక్ష‌ల మండ‌లి(ఎన్‌టీఏ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది జూలై 17న నీట్ ప‌రీక్ష‌కు హాజ‌రైన విద్యార్థినుల‌తో లోదుస్తులు విప్పించిన వివాదం కేర‌ళ‌లో చోటుచేసుకున్న విష‌యం విదిత‌మే.

  • Author : HashtagU Desk Date : 27-08-2022 - 4:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
NEET UG result 2025
NEET UG result 2025

జాతీయ ప‌రీక్ష‌ల మండ‌లి(ఎన్‌టీఏ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది జూలై 17న నీట్ ప‌రీక్ష‌కు హాజ‌రైన విద్యార్థినుల‌తో లోదుస్తులు విప్పించిన వివాదం కేర‌ళ‌లో చోటుచేసుకున్న విష‌యం విదిత‌మే. బాధిత విద్యార్థినుల‌కు మ‌ళ్లీ ప‌రీక్ష రాసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్టు ఎన్‌టీఏ తాజాగా ప్ర‌క‌టించింది. సెప్టెంబ‌రు 4న వారికి ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్టు పేర్కొంది. దీనిపై సంబంధిత విద్యార్థినుల‌కు ఈ – మెయిల్ ద్వారా స‌మాచారం పంపిన‌ట్టు వెల్ల‌డించింది.

నీట్ ప‌రీక్ష స‌మ‌యంలో త‌మ‌ను లోదుస్తులు విప్పాల‌ని ప‌రీక్ష సిబ్బంది ఒత్తిడి చేశారంటూ కొంద‌రు విద్యార్థినులు అప్ప‌ట్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్య‌వ‌హారం పెను దుమారం రేపింది. కేర‌ళ రాష్ట్రం కొల్లం జిల్లా ఆయుర్‌లోని మార్ధోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో నిర్వ‌హించిన ప‌రీక్ష సంద‌ర్భంగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. దీనిపై ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. త‌నిఖీల స‌మ‌యంలో లోదుస్తుల‌కు ఉన్న హుక్స్ కార‌ణంగా శ‌బ్దం వ‌చ్చింద‌ని, దీంతో దానిని తొల‌గించి ప‌రీక్ష‌కు వెళ్లాల‌ని త‌న కుమార్తెను సిబ్బంది ఆదేశించార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు అనంత‌రం మ‌రికొంద‌రు విద్యార్థినులు కూడా ఇదే త‌ర‌హా ఫిర్యాదులు చేశారు.

అప్ప‌ట్లో ఈ వ్య‌వ‌హారంపై తీవ్ర వివాదం రేగింది. ప‌లు విద్యార్థి సంఘాల నేత‌లు దీనిపై ఆందోళ‌న‌లకు దిగారు. విద్యార్థినుల‌తో అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించిన క‌ళాశాల సిబ్బందిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. అప్ప‌ట్లో ఈ ఫిర్యాదులపై ఎన్‌టీఏ స్పందిస్తూ.. ఇవి దురుద్దేశంతో కూడుకున్న‌వ‌ని బుకాయించింది. ఆ త‌ర్వాత దీనిపై నిజ నిర్ధార‌ణ క‌మిటీని నియ‌మించింది. ఆ త‌ర్వాత ఈ త‌నిఖీల్లో పాల్గొన్న ఐదుగురు సిబ్బందిని కేర‌ళ పోలీసులు అరెస్టు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Exam
  • girls
  • india
  • kerala
  • NEET

Related News

Four gangsters killed in encounter in Gurugram

Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, నేర జరిగిన తీరును పునర్నిర్మించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం, బరుయిపూర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి మరియు ఇతర పోలీసుల బృందం నిందితుడు ప్రభాస్ మోండల్‌తో కలిసి అర్ధరాత్రి 12:45 గంటల

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd