Kashmir Landslides : కాశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. నలుగురు మృతి
కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కాశ్మీర్ కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మరణించారు. మరణించిన వారి...
- By Prasad Published Date - 09:00 AM, Sun - 30 October 22

కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కాశ్మీర్ కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మరణించారు. మరణించిన వారి మృతదేహాలను పోలీసులు బయటికి తీశారు. ఈ ఘటనలో మరో ఆరుగురుని రక్షించినట్లు జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ దేవాన్ష్ యాదవ్ తెలిపారు. సంఘటన ప్రదేశంలో సహాయక చర్యలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. నిర్మాణంలో ఉన్న రాటిల్ పవర్ ప్రాజెక్ట్ స్థలంలో ఘోరమైన కొండచరియలు విరిగిపడిందని నివేదిక అందడంతో తాను జమ్మూ కాశ్మీర్‌లోని డిసి కిష్త్వార్‌తో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.