Minister Slaps Woman: మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి.. ఎక్కడంటే..?
కర్ణాటక మంత్రి వి. సోమన్న చామ్‌రాజ్‌నగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో భూమి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఒక మహిళను చెంపదెబ్బ కొట్టడం కెమెరాకు చిక్కింది.
- By Gopichand Published Date - 02:47 PM, Sun - 23 October 22

కర్ణాటక మంత్రి వి. సోమన్న చామ్‌రాజ్‌నగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో భూమి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఒక మహిళను చెంపదెబ్బ కొట్టడం కెమెరాకు చిక్కింది. చామరాజనగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో భూమి పట్టాల పంపిణీ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు భూమి పట్టా అందలేదని ఓ మహిళ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మహిళ తన వద్దకు వచ్చిన సమయంలో కోపంతో ఉన్న మంత్రి ఆమెను చెంపదెబ్బ కొట్టాడు.
మహిళను చెంపదెబ్బ కొట్టినప్పటికీ మంత్రి పాదాలను తాకి అతని ఆశీర్వాదం తీసుకుంది. అయితే.. కర్ణాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి సోమన్న తనను కొట్టారనే విషయాన్ని కెంపమ్మ అనే మహిళ ఖండించింది. మంత్రి తనను ఓదార్చారని.. ఇంట్లో ఇతర దేవుళ్లతో పాటు తాను మంత్రిని పూజిస్తానని ఆమె చెప్పారు.
నాది చాలా నిరుపేద కుటుంబం.. భూమి కేటాయించి సాయం చేయమని ఆయన కాళ్లపై పడి అడిగాను.. అందుకే లిఫ్ట్ చేసి ఓదార్చాడు. కానీ నన్ను చెప్పుతో కొట్టినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు అని కెంపమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి మాకు భూమి ఇచ్చాడు. మేము చెల్లించిన రూ. 4,000 కూడా తిరిగి ఇచ్చారు. మేము మంత్రిని పూజిస్తామని ఆమె పేర్కొంది.