CM Bommai: కర్నాటక సీఎం బొమ్మైకి పదవీగండం?
కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై కి పదవీ గండం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. 19శతాబ్దంలో బ్రిటీష్ వాళ్లపై పోరాడిన కిట్టూర్ రాణి చెన్నమ్మ విగ్రహావిష్కరణకు వెళ్లిన ఆయన ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఈ పదవి శాశ్వతం కాదు..
- By CS Rao Published Date - 03:08 PM, Mon - 20 December 21

కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై కి పదవీ గండం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. 19శతాబ్దంలో బ్రిటీష్ వాళ్లపై పోరాడిన కిట్టూర్ రాణి చెన్నమ్మ విగ్రహావిష్కరణకు వెళ్లిన ఆయన ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఈ పదవి శాశ్వతం కాదు..ఇప్పుడు సీఎంగా ఉన్నాను. పదవీచ్యుడ్ని ఎప్పుడు అవుతామో తెలియదు..కానీ, మీ ప్రేమ గొప్పదంటూ షగ్గాన్ నియోజకవర్గం ప్రజల వద్ద మొరపెట్టుకున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు బొమ్మై నుంచి రావడంతో త్వరలోనే ఆయనకు పదవీ గండం ఉందని భావిస్తున్నారు.
కర్నాటక సీఎంగా యడ్యూరప్ప రెండేళ్లు ఉన్నాడు. ఆయన మీద వచ్చిన పలు ఆరోపణలు, వయస్సు మీద పడడం దృష్ట్యా బీజేపీ అధిష్టానం పదవీచ్యుడ్ని చేసింది. ఆ స్థానంలో సీఎంగా బసవరాజు బొమ్మైని నియమించింది. ఇటీవల కాలంలో ఆయన మోకాలి నొప్పితో బాధ పడుతున్నాడు. త్వరలోనే చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లడానికి సిద్ధం అవుతున్నాడు. ఆ లోపుగానే ఆయన స్పీచ్ లో తేడా వచ్చింది.
నియోజకవర్గం ప్రజలకు బసవరాజుగానే బతికినంత కాలం ఉంటానని చెప్పాడు. కర్నాటక సీఎంగా అందరికీ ఉన్నప్పటికీ మీకు మాత్రం ఎప్పుడూ బసవరాజుగానే ఉంటానని నైరాశ్యంగా మాట్లాడాడు. నియోజకవర్గ ప్రజల ప్రేమ ముందు ఎలాంటి పదవులు పెద్దవి కాదంటూ వ్యాఖ్యానించాడు. అభివృద్ధికి సంబంధించిన పెద్ద అంశాలు తన భుజాల మీద లేవని అన్నాడు. ఇలా..ఆయన నైరాశ్యంగా మాట్లాడడం గమనిస్తే..త్వరలోనే ఆయన సీఎం పదవి ఊడనుందని ప్రచారం ఊపందుకుంది.