Kamal Haasan : అభిమానులపై కమల్ హసన్ ఆగ్రహం
Kamal Haasan : తమిళనాడు రాజధాని చెన్నైలోని అల్వార్పేటలో తన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
- By Sudheer Published Date - 07:50 PM, Sat - 14 June 25

మక్కల్ నీది మయ్యమ్ (MNM) పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు మరియు రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ (Kamal Haasan ) తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలోని అల్వార్పేటలో తన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో అభిమానులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమల్‌ను చూడాలని, ఆయనతో సెల్ఫీలు తీయాలని, భేటీ కావాలని అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
Kim Jong Un: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. కిమ్ జాంగ్ ఉన్ కీలక ఆదేశాలు!
అయితే ఈ సమావేశంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కమల్ హాసన్‌ను కలవడానికి వచ్చిన కొంతమంది అభిమానులు అతనికి ఒక పెద్ద ఖడ్గాన్ని (స్వర్డ్) బహూకరించారు. దానిని చేతబట్టి ఫోటోకి నిలవాలని కోరారు. అయితే కమల్ హాసన్ ఇందుకు అసహనం (Kamal Haasan Gets Angry) వ్యక్తం చేశారు. ఖడ్గం లాంటి ఆయుధాలను ప్రచారంలో భాగంగా ఉపయోగించడం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఖడ్గం పట్టుకోవాలని పదేపదే ఒత్తిడి చేయడంతో కమల్ హాసన్ కాస్త కఠినంగా స్పందించారు. “దానిని టేబుల్ మీద ఉంచండి” అంటూ గట్టిగా హెచ్చరించారు. అభిమానులకి తగిన సందేశం ఇచ్చిన కమల్, రాజకీయాలలో, ప్రజాసేవలో హింసకు ప్రాధాన్యత లేదని మరోసారి నిరూపించినట్టయింది. ఈ ఘటన ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశమవుతోంది.
ఇదిలా ఉంటె..రీసెంట్ గా కమల్ రాజ్యసభ కు ఎన్నికైన సంగతి తెలిసిందే. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ (DMK) మిత్రపక్షంగా కమల్ హాసన్‌కు రాజ్యసభ సీటు కేటాయించింది. ఇది వారి రాజకీయ స్నేహానికి నిదర్శనంగా కనిపిస్తుంది. డీఎంకే పార్టీ తరపున కమల్ హాసన్ పేరు ప్రకటించగా, ఆయన నామినేషన్ వేసారు. ఆసక్తికర విషయం ఏమంటే.. ఆ సీటుకు ఇతర అభ్యర్థులు ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఎన్నికల కమిషన్ కమల్ హాసన్‌ను ఏకగ్రీవంగా ఎన్నికైనవారిగా ప్రకటించింది.
ఈ విజయం కమల్ హాసన్ రాజకీయ ప్రస్థానానికి బలాన్ని చేకూర్చనుంది. సినీ నటుడిగా తనకున్న ప్రజాదరణను రాజకీయ వేదికపై సార్థకంగా మలచుకునే అవకాశం ఇది. రాబోయే రోజుల్లో రాజ్యసభలో ఆయన మాట్లాడే మాటలు, ప్రతిపాదనలు దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపే అవకాశం ఉంది. డీఎంకే మద్దతుతో ఆయనను ఎంపిక చేయడం, మిత్రపక్షాల మధ్య ఐక్యతను మరింత బలపరిచే అంశంగా భావించవచ్చు.