HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Grand Welcome For Nara Lokesh In Karnataka

Nara Lokesh: కర్ణాటకలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం.

  • Author : Vamsi Chowdary Korata Date : 04-04-2026 - 11:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh Karnataka Tour
Nara Lokesh Karnataka Tour

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు కర్ణాటక పర్యటనలో అపూర్వ స్వాగతం లభించింది. రాయచూర్ జిల్లా సింధనూరు చేరుకున్న ఆయనకు స్థానిక తెలుగు సంఘాలు, యువత, అభిమానులు, వివిధ పార్టీల నాయకులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్‌తో కలిసి లోకేశ్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో కర్ణాటకలోని తెలుగు ప్రజలు, స్థానిక నేతలు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. సుమారు 53 రోజుల పాటు సింధనూరు, రాయచూర్ ప్రాంతాల్లో నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. ఒక్క సింధనూరులోనే 10 వేల మందితో భారీ ర్యాలీ చేపట్టారు. ఆ కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపేందుకే లోకేశ్‌ ఈ పర్యటన చేపట్టారు. సింధనూరు చేరుకున్న ఆయనకు మాజీ మంత్రి, జేడీఎస్ నేత వెంకటరావు నాడగౌడ, స్థానిక ఎమ్మెల్యే హంపన్న గౌడ, బీజేపీ నేత కే. కరియప్ప సహా పలువురు పార్టీలకతీతంగా ఘన స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో భాగంగా ఎంజీ సర్కిల్ నుంచి హోసళ్లీ క్యాంపు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి లోకేశ్‌తో పాటు కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేథ్ కూడా ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా యువగళం జెండాలు చేతబూనిన యువత, ప్రజలు పూలు చల్లుతూ ‘జై లోకేశ్‌’ అంటూ నినాదాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. లోకేశ్‌ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారితో ఫొటోలు దిగుతూ ముందుకు సాగారు.

పర్యటనలో భాగంగా సింధనూరు హోసళ్లీ క్యాంపులోని కమ్మవారి కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన దివంగత ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేశ్‌ ఆవిష్కరించనున్నారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొననున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • HD Kumaraswamy
  • jds
  • Karnataka tour
  • Minister Nara lokesh
  • Sindhanur
  • Telugu community

Related News

government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో విచారణ ముందుకు సాగనుంది. పంచాయతీ ఎన్నికల సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్

  • CM Chandrababu is the person who made gems rain in Rayalaseema: Minister Nara Lokesh.

    Nara Lokesh: రాయలసీమలో రత్నాలు పడేలా చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి నారా లోకేష్

Latest News

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

  • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd